అక్టోబర్ 4 వరకూ దరఖాస్తులు

జర్నలిస్టులు కొత్త అక్రిడిటేషన్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు అక్టోబర్ 4 వరకు గడువు ఇచ్చినట్లు రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ విజయ్ కుమార్ పేర్కొన్నారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారు వివరాల నమోదులో మార్పులు చేసుకోవచ్చని.. వీడియో సంస్థలు మారిన పాత్రికేయులు కొత్తగా దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. దరఖాస్తు చేసే పాత్రికేయులు యాజమాన్య సంస్థల సిఫార్సు లేఖలు సమర్పించాలని చెప్పారు