Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

పర్యావరణ పరిరక్షణకు మనకు మనం మారాలి

రిజర్వుడు ఫారెస్ట్ లో అక్రమాలు చేపడితే చట్టపరమైన చర్యలు తప్పవు

*ఫారెస్టులో అవినీతికి సహకరించిన అధికారులపై  చర్యలు తప్పవు*

ఆదోని మే20 (నిజం న్యూస్) ఆదోని రేంజ్ పరిధిలో ఉన్న రిజర్వుడు

ఫారెస్ట్ భూముల్లో ఎవరైనా అక్రమంగా తవ్వకాలు చేపట్టిన అడవులను ద్వంసంచేసినా కఠినమైన చర్యలు తప్పవని హెచ్చరించారు

జిల్లా అటవీ అధికారి శివ శంకర్ రెడ్డి శనివారం ఆదోని రేంజ్ కార్యాలయంలో లైఫ్ స్టైల్  ఫర్  ఎన్విరాన్మెంటల్  కార్యక్రమంలో భాగంగా వచ్చిన ఆయన విలేకర్లతో మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడుటకు ప్రతి ఒక్కరు  మన జీవన విధానాన్ని మార్చుకోవాలని అన్నారు

ఈ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి మోడీ ప్రారంభించారని  సహజ వనరులను పరిమితి స్థాయిలో ఉపయోగించుకోవాలని వాతావరణం కలుషితం కాకుండా చూడాలని అన్నారు

ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ ఉపయోగం తగ్గించాలని ప్రతి ఒక్కటీ పరిమితి స్థాయిలో ఉపయోగించుకొన్నపుడే భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా ఉంటుందని అన్నారు

అలాగే  గత సంవత్సరంలో  మండల పరిధిలో ఉన్న నాయణపురం సమీపంలో జింకలు వేటకు సంబందించిన  కేసుకు సంబంధించి మరింత సమాచారాన్ని ప్రజల నుండి సేకరించి కేసుకు సంబందించిన నిందితులపై త్వరలో ఛార్జిసీట్ ను రెడీ చేస్తున్నట్లు తెలిపారు

అదేవిధంగా ఆలూరు,హాలహర్వి,హోలగుంద ఆస్పరి మండలంలో అత్యధికంగా ఉన్న  కృష్ణజింకలు నుండి  రైతులు పంటలను నాశనం చేస్తున్నందున ప్రభుత్వం చర్యలు తీసుకునేందుకు తుంగభద్ర  సమీపంలో 20 కోట్లరూపాయలతో తుంగభద్ర సమీపంలో జింకల పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు కు ప్రణాళికలు తయారు చేసి ప్రభుత్వ ఆమోదుకు పంపినట్లు తెలిపారు

ప్రస్తుతం 10 కోట్లు కేటాయించినట్లు తెలిపారు అక్కడే వాటికి ఆహారం,నీటి వసతిని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు

అదేవిధంగా  ప్రస్తుత జీవన విధానంలో ప్రజలు మానసిక ఉల్లాసానందానికి ఆదోని ఎమ్మిగనూరు రోడ్ లో ఉన్న బనవాసి సమీపంలో సుమారు 50 హెక్టార్ల ప్రభుత్వ భూమిలో సిటీ పార్కును ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు

Also read: చెరువుల అభివృద్ధి కోసం కృషి

అదే విధంగా ప్రభుత్వం అడవుల సంరక్షణలో ప్రత్యేక దృష్టి సారించిందని విచ్చలవిడిగా చెట్లను నరకరదాని ప్లాస్టిక్ వాడరాదని,అన్నారు వాల్టా చట్టానికి లోబడి అధికారుల అనుమతులతో చెట్లు నరకాల్సి ఉంటుందని అన్నారు అనుమతి లేకుండా నరికిన చెట్లను తరలిస్తే వాహనాలను సీజ్ చేస్తామని తెలిపారు

కాబట్టి కట్టెల మిల్లులు యజమానులు కచ్చితంగా అదికారులు ఇచ్చిన సర్టిఫికెట్లు ఉంటేనే చెట్లు కొనాల్సిఉంటుందని అన్నారు

అలా కాకుండా మిల్లు యజమానులు నిబంధనలు అతిక్రమిస్తే లైసెన్సులు రద్దుచేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో రేంజ్ అధికారి వెంకటరాముడు సెక్షన్ అధికారులు బీట్ అధికారులు తదితరులు పాల్గొన్నారు