Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

చెరువుల అభివృద్ధి కోసం కృషి

తెలంగాణ ప్రభుత్వం చెరువుల అభివృద్ధి కోసం ఎంతగానో కృషిచేస్తుందని ఎమ్మెల్యే

సంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ 20 మే (నిజం న్యూస్)

చంటి క్రాంతికిరణ్ అన్నారు.సంగారెడ్డి జిల్లా అందోలు చెరువు కట్టపై సుందరికరణ పనులను క్రాంతి కిరణ్ ప్రారంభించారు.ఈ సందర్బంగా మున్సిపల్ ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి 2 కోట్ల 55 లక్షల నిధులతో చేపడుతున్న సుందరికరణ పనులకు టెంకాయ కొట్టి ప్రారంభించారు.

చెరువు కట్టపై చేపడుతున్న అభివృద్ధి పనులను క్రాంతి కిరణ్ అధికారులను కాంట్రాక్టర్లను అడిగి వివరాలు తెలుసుకున్నారు.

Also read:జాగ్రత్తలు పాటిస్తూ పనికి వెళ్లాలి

ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం చెరువు సుందరికరణ పనులను ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతుందని అన్నారు.అందులో భాగంగానే అందోలు చెరువు సుందరికరణకు ప్రభుత్వం 2 కోట్ల 55 లక్షల రూపాయలు నిధులు వెచ్చించ్చిందని తెలిపారు.

చెరువు కట్టపై వాకింగ్ ట్రాక్ తో పాటు జిమ్ చిన్న పిల్లలకు ఆట వస్తువులతో పాటు చేరువుపై సుందరికరణ పనులు చేపడతామని తెలిపారు.అలాగే అందోలు జోగిపేట మున్సిపల్ పరిధిలో కురుమ ముదిరాజ్ పలు కుల సంఘాల భవనాలకు 20 నుండి 30 లక్షల రూపాయల వరకు మంజూరైనట్టు తెలిపారు.

పట్టణాల అభివృద్ధి కోసం నిధులు మంజూరైనట్టు తెలిపారు. అందోల్ తొలిసారి ఎమ్మెల్యే బసవ మణయ్య మరియు పొట్టి శ్రీ రాములు కమ్యూనిస్టు నేత మాగ్దుం మైనోద్దీన్ విగ్రహలను పట్టణంలో ఏర్పాటు చేయనున్నట్టు ఎమ్మెల్యే క్రాంతికిరన్ తెలిపారు.