Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

జాగ్రత్తలు పాటిస్తూ పనికి వెళ్లాలి

డి ఆర్ డి ఓ కిరణ్ కుమార్
ఆత్మకూర్ ఎస్ మే 20 (నిజం న్యూస్): ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందువల్ల కూలీలు జాగ్రత్తలు పాటిస్తూ పనికి వెళ్లాలని జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీ సుందరీ కిరణ్ కుమార్ అన్నారు.

శనివారం నసీంపేట గ్రామ పంచాయతీ ఉపాధి హామీ పథకంలో భాగంగా చెరువు పూడికతీత పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
ఎండలు బాగా ఉన్నందున ఉదయం 6 గంటల నుండి 11 గంటల వరకు పనిచేయవలసిందిగా సూచించారు.

Also read: ప్రశ్నిస్తే దాడులు చేయడం నీ చేతకాని తనమే

అదేవిధంగా కొలతల ప్రకారం పని చేయించు కూలీలకు 272/-రూపాయలు వచ్చే విధంగా చూయించి పనులు చేయించవలసిందిగా ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో ఏపీవో ఈశ్వర్, ఉపాధి కూలీలు తదితరులు ఉన్నారు.