ఈ భూమి మాదే… పట్టాలు ఇవ్వండి
మరిపెడ మే 18 నిజం న్యూస్
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం అబ్బాయి పాలెం గ్రామంలో నారం రెడ్డి పురుషోత్తమ రెడ్డి అతని కుటుంబ సభ్యులు గత 68 ఏళ్లు క్రితం మా తాతల తండ్రుల పేరు మీదఉన్న భూమిని కబ్జాల కాస్తులో ఉంచుకొని దళితులకు దక్కనీయకుండా చేస్తున్నారని ఈ భూమి మాదే ప్రభుత్వం మాకు పట్టాలు ఇవ్వాలని ఆ గ్రామానికి చెందిన దళితులు జినక ఏకస్వామి ,జినక మల్లయ్య, జినక పరశురాములు, చంద్రయ్య, కిరణ్ ,వెంకన్నలు, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
శుక్రవారం కొమ్ము గుంట రాళ్ల పక్కన ఉన్న మామిడి తోట వ్యవసాయ భూమిని స్వాధీన పరుచుకున్నారు . సర్వేనెంబర్ 23, లో 8 ఎకరాల 4గంటల భూమి 1955 జినక ముత్తయ్య బదులు అనబత్తుల ముత్తయ్యగా పడిందనీ, ఆనాడు మా తాతలు తండ్రులు వారి వద్ద పాలేరుగా (జీతగాండ్లు) పని చేసి వెట్టి సాకిరి చేశారని పేర్కొన్నారు.
వారి అమాయకత్వాన్ని ఆసరా చేసుకునీ వేలిముద్రలను తీసుకొని అట్టి భూమిని వారి పేర్లపై మార్చుకున్నారని వారు ఆరోపించారు. ఇటీవల కాలంలో మా అన్నదమ్ముల భూభాగాలనుపంచుకుందామని భూమి హద్దులు చూస్తుండగా ఇట్టి విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో భూస్వామి కంగుతిన్నారనీ వారు తెలిపారు.
ALSO READ: మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఆర్టిస్ట్- బ్రాండెడ్ జ్యువెలరీ షో
మాట్లాడుకుందాం అంటూ వాయిదా వేస్తూ వచ్చారని తెలిపారు. పట్టా వారి పేరు మీద ఉండడంతో మాట్లాడుకోవటానికి రాకపోగా ఏం చేసుకుంటారో చేసుకో పో అంటూ మమ్ములను బెదిరించి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అనబత్తుల ముత్తయ్య ఆలియస్ (జినక ముత్తయ్య)
కుమారులు జినక బాలయ్య, జినక ఇదయ్య, జినక వెంకయ్య, వారసులకు ఈ భూమి రావాలని వారు డిమాండ్ చేశారు.
ఇన్నేళ్లపాటు మా భూమిని అక్రమంగా పట్టా చేసుకొని అనుభవించడమే కాకుండా మమ్ములను బెదిరిస్తున్నారని వారు ఆరోపించారు. ప్రభుత్వం స్పందించి ఇటు భూమిపై సమగ్రమైన విచారణ జరపాలని అట్లాగే నారంరెడ్డి పురుషత్తురెడ్డి తండ్రి సీతారరాంరెడ్డి, పేరు మీది ఉన్న పట్టాను రద్దు మా దళితుల పేరు మీద పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
ఈ సమావేశంలో జినక సైదులు, బాబు, యాకన్నా, నరేష్, జినక శ్రీను, శీను, జినక వెంకన్న, నాగరాజు ,బాబు, తదితరులు ఉన్నారు.