మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఆర్టిస్ట్- బ్రాండెడ్ జ్యువెలరీ షో
గండిపేట్, మే 19 (నిజం న్యూస్): ఆర్టిస్ట్రీ బ్రాండెడ్ జువెలరీ షోరూం మెహిదీ పట్నం మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షో రూమ్ లో విశిష్ట ఆభరణాల ప్రదర్శన శనివారం నుండి ఈ నెల 28వ తేదీ వరకు కొనసాగుతుందని స్టోర్ హెడ్ రమీజ్ తెలిపారు.
ఈ ప్రదర్శనలో భాగంగా బంగారం, వజ్రా భరణాలు జాతి రత్న ఆభరణాలను శుక్రవారం సాయంత్రం ప్రదర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ఆభరణాలు అద్వితీయమైన కళా నైపుణ్యతతో అంతులేని హుందాతనంతో కూడుకున్నదని, నగిసి చెక్కిన ప్రతి ఆభరణం తయారుచేసిన వారి అనుభవం ఇంకా కళాత్మకత కి నిదర్శనంగా నిలుస్తుందని అన్నారు.
ALSO READ: జాతీయస్థాయి టార్గెట్ బాల్ గేమ్ కు ఎంపికైన గోపికృష్ణ
మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ నిబద్ధతలో భాగంగా తమ వినియోదారులకు 10 నాణ్యమైన వాగ్దానాలను అందిస్తుందని పేర్కొన్నారు. ఖచ్చితమైన తయారీ ధర, రాళ్ల బరువు, నికర బరువు, ఆభరణాల విలువతో కూడిన పారదర్శక ధరల పట్టి, ఆభరణాలకు జీవితకాల ఉచిత నిర్వహణ తోపాటు పాత బంగారు ఆభరణాలను తిరిగి విక్రయించేటప్పుడు బంగారానికి 100% విలువ మార్పిడిపై శూన్య తగ్గింపు, నూరు శాతం బిఐఎస్ హాల్ మార్కుతో ధ్రువీకరించబడిందని తెలిపారు.
అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నాణ్యత పరీక్షలు నిర్వహించిన ఐజిఐ, జిఐఏ ధ్రువీకరించిన వజ్రావరణాలు బై బ్యాక్ గ్యారంటీ నాణ్యతను తనిఖీ చేయడానికి ఎనలైజర్ జీవితకాల నిర్వహణ ఉంటుందన్నారు.
ఈ సంస్థ తమ వార్షిక ఆదాయంలో సామాజిక సంస్థ గత బాధ్యత రూపంలో ఆరోగ్యం ఉచిత విద్య నిరుపేదలకు గృహ నిర్మాణం మహిళా సాధికారిక ఇంకా పర్యావరణ రక్షణ విభాగాలలో కూడా సాయం అందజేస్తుందని అన్నారు.