జాతీయస్థాయి టార్గెట్ బాల్ గేమ్ కు ఎంపికైన గోపికృష్ణ

గరిడేపల్లి మే 19 (నిజం న్యూస్) మండల కేంద్రానికి చెందిన ప్రధాని గోపికృష్ణ జాతీయస్థాయి టార్గెట్ బాల్ గేమ్ కు ఎంపికైనట్లు సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి గుగులోతు నగేష్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఈనెల 15,16 తేదీలలో హైదరాబాద్ లోని అల్వాల్ లో జరిగిన సీనియర్ రాష్ట్రస్థాయి టార్గెట్ బాల్ గేమ్ లో ఆడిన గోపి కృష్ణ అందులో గెలిచి జాతీయస్థాయిలో ఆడెందుకు ఎంపికయ్యాడు.
ALSO READ: దేశం గర్వించదగ్గ రాష్ట్రంగా తెలంగాణ
ఈనెల 24 నుండి ఉత్తరప్రదేశ్ మత్తుర లోని జి ఎల్ ఏ యూనివర్సిటీలో జరిగే జాతీయస్థాయి క్రీడలకు తెలంగాణ టీం తరఫున పాల్గొంటాడు.
గోపికృష్ణ ఎంపిక పట్ల గ్రామ నాయకులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు,ప్రత్యేక అభినందనలు తెలిపారు.