దేశం గర్వించదగ్గ రాష్ట్రంగా తెలంగాణ

దేశం గర్వించదగ్గ రాష్ట్రంగా తెలంగాణ అభివృద్ధి చెందింది.
మంత్రి జగదీశ్వర్ రెడ్డి
తిరుమలగిరి మే 19 నిజం న్యూస్.
తెచ్చుకున్న తెలంగాణలో సాధించిన అభివృద్ధిని చూసి అన్ని రాష్ట్రాలు తెలంగాణ వైపు చూస్తూ ఉన్నాయని విద్యుత్ శాఖ మంత్రి, గుంటకoడ్ల జగదీశ్వర్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో ని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో తిరుమలగిరి మండల బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళన మహా సభ ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ గోదావరి జలాలతో తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గంలోని అన్ని గ్రామాల చెరువులను నింపి చివరి భూముల వరకు నీరు అందించిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు.
ఆనాడు భీమిరెడ్డి నరసింహారెడ్డి నోటా తెలంగాణ మాట విన్నామని ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రాన్ని కెసిఆర్ ఉద్యమం ద్వారా కొట్లాడి తెచ్చుకున్నామని చెప్పారు. తెచ్చుకున్న తెలంగాణ అభివృద్ధి పదములో ముందుకు నడిపించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారని వాటి ఫలాలు గ్రామీణ ప్రాంత ప్రజల అoదుతున్నాయని చెప్పారు.
బిజెపి పార్టీ పరిపాలించే రాష్ట్రాల్లో కూడా 24 గంటల ఉచిత విద్యుత్తు లేదని మీటర్లతో బిల్లులు వసూలు చేస్తున్నారని చెప్పారు. తుంగతుర్తి నియోజకవర్గం లో గతంలో కక్షలు, కొట్లాటలు చంపుకోవడంలో ఉండేవని నేడు ప్రశాంత వాతావరణంలో ప్రజలు ఉన్నారని చెప్పారు. ప్రజలు గాదరి కిషోర్ కుమార్ కు 50 వేల వేట్ల మెజార్టీతో మూడోసారి గెలిపించాలని చెప్పారు.
అభివృద్ధిలో ముందున్న తెలంగాణ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్.
కెసిఆర్ సచ్చుడు తెలంగాణ వచ్చుడు అనే నినాదంతో సాధించుకున్న తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి అన్ని రాష్ట్రాలు తెలంగాణ అభివృద్ధి వైపు చూసే విధంగా అభివృద్ధి చెందిందని ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ చెప్పారు.
రైతులకు రైతు బీమా, రైతు బంధు, 24 గంటల ఉచిత కరెంటు, పేదింటి ఆడబిడ్డకు కల్యాణ లక్ష్మి, షాధి ముబారక్, కెసిఆర్ కిట్టు, మిషన్ భగీరథ ద్వారా మంచినీళ్లు, మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పూడిక తీత పనులు, ఎండాకాలంలో కూడా చెరువులలో నీళ్లు ఉన్నాయని అంటే ఘనత కేసిఆర్ దేనని చెప్పారు.
తిరుమలగిరి మండలంలో 49,250 మందికి ఆసరా పింఛన్లు, 18,250 పందికి ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ కింద ఆర్థిక సహాయం అందించామని చెప్పారు. తుంగతుర్తి నియోజకవర్గం లో 316 బూతులు ఉన్నాయని ఒక్కొక్క బూతులు 100 మందికి ఒకరి చొప్పున నియమించుకొని కిందిస్థాయిలో టిఆర్ఎస్ పార్టీ పటిష్టం కోసం అందరు కృషి చేయాలని చెప్పారు.