Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఈ ట్రాన్స్ఫార్మర్ ఏ క్షణంలో పడుతుందో

ప్రమాదం నీడలో గ్రామం

నత్త నడకన విద్యుత్ యంత్రాంగం

ఏ క్షణంలో పడుతుందో .. ప్రమాదం నీడలో గ్రామం

ముధోల్ నియోజకవర్గ ప్రతినిధి మే 19 (నిజం న్యూస్)

తానూర్ మండలంలోని సింగన్ గాం గ్రామంలో ట్రాన్స్ఫార్మర్స్ ఏ క్షణంలో పడుతుందో ,ప్రమాదం ఉందని గ్రామ ప్రథమ పౌరుడు, గ్రామస్తులు చెప్పిన పనులు మాత్రం జరుగడం లేవు.

గ్రామ సర్పంచ్ సత్యనారాయణ మాట్లాడుతూ సుమారుగా రెండు సంవత్సరాల నుండి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్స్ ఒకవైపు ఒరగడం మొదలైందని , విద్యుత్ అధికారులకు సమస్యను పరిష్కరించాలని కోరామని అన్నారు.

ALSO READ: మావోయిస్టు పార్టీ మిలీసియా డిప్యూటీ కమాండర్ అరెస్ట్

ప్రస్తుతం రెండు సపోర్ట్ తీగలపై ఆగిందని, ఏ క్షణంలో పడుతుందో తెలియని విధంగా ప్రమాదంలో ఉన్నామని అన్నారు.ట్రాన్స్ఫార్మర్స్ ఉంచడానికి గద్దె నిర్మాణ పనులు ఎండాకాలం ప్రారంభంలో మొదలయ్యాయని, మొరం పోసి, ఒక స్థంభం పెట్టారు.

ఎండాకాలం పూర్తి అవుతున్నా అధికారులు పనులు వేగవంతం చేయటం లేదని అన్నారు.ఇప్పటికైనా అధికారులు స్పందించి వర్షకాలం ప్రారంభం కాకముందే గద్దె నిర్మాణం పూర్తి చేసి ట్రాన్స్ఫార్మర్స్ నెలకొల్పాలని అన్నారు.