మావోయిస్టు పార్టీ మిలీసియా డిప్యూటీ కమాండర్ అరెస్ట్

-ఏ ఎస్పి. పారితోజ్ పంకజ్
చర్ల మే 19 (నిజం న్యూస) నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ మిలీషియా డిప్యూటీ కమాండర్ సోడిదేవా (28) చర్ల పోలీసులు అరెస్టు చేసినట్లు భద్రాచలం ఏ ఎస్పి. పారితోజ్ పంకజ్ శుక్రవారం వెల్లడించారు
మండలంలోని లెనిన్ కాలనీ పూసు గుప్ప రహదారిపై పోలీసులు సిఆర్పిఎఫ్ 141 బెటాలియన్ సంయుక్తంగావాహన తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమాన స్పదంగా తప్పించుకొని పారిపోతున్న వ్యక్తిని పట్టుకొని అరెస్ట్ చేసి విచారించగా అతను చతీష్ గడ్ రాష్ట్రం తుర్రం పోలీస్ స్టేషన్ బీజాపూర్ జిల్లా కోమటిపల్లి గ్రామానికి చెందిన వాడని తెలిపారు.
ALSO READ: మొక్కజొన్న పంట దగ్ధం
ఇతను 2019 సంవత్సరంలో కోమటిపల్లి ఆర్.పి.సి మిలీషియా సభ్యుడుగా పనిచేశాడని గత సంవత్సరం నుండి ఆర్.పి.సి డిప్యూటీ కమాండర్ గా పనిచేస్తున్నాడని ఇతడు పూజారి కాం కేర్ కోమటిపల్లి ఆర్.పి.సి మిలీషా సభ్యులతో పాటు చర్ల ఎల్ ఓ ఎస్ సభ్యులతో కలసి గత సంవత్సరం 2022 జూలై ఆగస్టు నెలలో చర్ల మండలం బూతు గొప్ప అటవీ ప్రాంతంలో కూబింగ్ కు వచ్చే పోలీసులను చంపాలనే లక్ష్యంతో ప్రైజర్ మైన్స్ అమర్చిన సంఘటనలో పాల్గొన్నాడు
తెలంగాణ రాష్ట్రం లో నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ ప్రజల్లో విశ్వాసం కోల్పోయి ఆదరణ లేక తెలంగాణ ప్రాంతం లో విధ్వంచ కర చర్యలకు పాల్పడడానికి సతీష్ రాష్ట్రానికి చెందిన అమాయక ఆదివాసీలను మిలీసియా సభ్యులుగా దళ సభ్యులుగా చేర్చి ఉనికి కోసం స్వార్ధ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారన్నారు.
నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీకి ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని సహకరించిన సత్తా వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు ఈ కార్యక్రమంలో సిఆర్పిఎఫ్ 141 బెటాలియన్ అధికారులు చర్ల సిఐ బి అశోక్ పాల్గొన్నారు