మొక్కజొన్న పంట దగ్ధం
జమ్మికుంట, మే 19 (నిజం న్యూస్)
ప్రమాదవశాత్తు మొక్కజొన్న పంట దగ్ధం అయ్యింది.
ఈ ఘటన ఇల్లంతకుంట మండలం శ్రీరాములపల్లి గ్రామంలో ప్రమాదవశాత్తు మొక్కజొన్న పంట నిప్పంటుకుని పూర్తిగా దగ్ధం అయింది.
ఆరుకాలం శ్రమించి పండించిన పంట బూడిద పాలు కావడంతో అక్కడున్న రైతుల రోదనలు మిన్నంటాయి.
అధికారులు వెంటనే స్పందించి ప్రమాదంపై విచారణ జరిపి పంట నష్ట పోయిన రైతులకు న్యాయం చేయవలసిందిగా రైతులు కోరుతున్నారు