Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

పొలంలోనే నకిలీ విత్తనాల తయారీ

నకిలీ విత్తనాల జోరు రైతులు గగ్గోలు

సంగారెడ్డి సదాశివపేట మే 19 ( నిజం న్యూస్ )

సదాశివపేట మండలంలోని ఆత్మకూరు గ్రామంలో నకిలీ విత్తనాలు ,మందులు తయారు చేస్తున్న అదే గ్రామానికి చెందిన జయం ఉదయ్ అనే వ్యక్తి ని సమాచారం మేరకు, జిల్లా కలెక్టర్ ఆదేశాలతో శుక్రవారం జిల్లా వ్యవసాయ అధికారి తనిఖీ చేసారు.

ఈ సందర్భంగా అదే గ్రామానికి చెందిన ఒక రైతు మాట్లాడుతూ ఉదయ్ వద్ద  విత్తనాలు కొనుగోలు చేసి నాలుగు ఎకరాలు పంటవేయగా మొత్తం పంట నష్టపోయానని నెరెడి నగేష్  తెలిపారు.

ALSO READ: వేసవి సెలవుల్లో కూడ చదువు చెప్పే ప్రభుత్వ ఉపాధ్యాయుడు

తనకు పంట నష్టపరిహారం ఇస్తానని అప్పట్లో గ్రామ ప్రజల సమక్షంలో ఉదయ్ కుమార్ ఒప్పుకోవడం జరిగింది తెలిపాడు.

ఇప్పటివరకు ఇవ్వకపోగా ఏమైనా చేసుకో అంటున్నాడని రైతు బాధపడ్డాడు.

ఈ విషయంపై జిల్లా అధికారికి తెలుపగా ఈరోజు వచ్చి ఆకస్మాత్తుగా విత్తనాలు తయారు చేస్తున్న యూనిట్ ను తనిఖీ చేయడం వల్ల అక్కడ బొగ్గు, షాంపూ , పౌడర్లు , అర్హత లేని మందు డబ్బాలు, ముందు బిళ్ళలపత్తాలు కనబడంతో వాటిని  సీజ్ చేసారు.