వేసవి సెలవుల్లో కూడ చదువు చెప్పే ప్రభుత్వ ఉపాధ్యాయుడు
వేసవి సెలవుల్లో ఊరికి వెళ్లి చదువు చెప్పే ప్రభుత్వ ఉపాధ్యాయుడు
వాంకుడోత్ గోపీనాథ్
ఎస్ జి టి పాటిమీది గూడెం
మహబూబాబాద్ బ్యూరో మే 19 నిజం న్యూస్
సాధారణంగా సెలవులు వచ్చాయంటే సరదాగా కుటుంబ సభ్యులతో గడుపుదామని చాలామంది అనుకుంటారు కానీ కొందరు మాత్రం వృత్తి ధర్మాన్ని మర్చిపోకుండా తపిస్తూ ఉండే వారు ఉంటారు వారిలో ఒకరు ఒక్కరు మారినా చాలు ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఎంపీపీ ఎస్ పాటిమీది గూడెంలో ఎస్ జి టి టీచర్ గా పనిచేస్తున్న వాంకుడోత్ గోపీనాథ్ ఒక టీచరుగా పిల్లలకు విద్య బుద్ధులను నేర్పిస్తూ సమాజంలో చిన్న చిన్న సేవా కార్యక్రమాలను చేస్తూ ముందుకు సాగుతున్నారు..
Also read: తక్కువ ధరకే ఇసుక
ఎండాకాలం సెలవులు రావడంతో విద్యార్థులు నేర్చుకున్న విద్యను మర్చిపోకూడదనే ఉద్దేశంతో తన పాఠశాల ఉన్న ఊరికి వచ్చి ఊరి వెలుపల ఉన్న చింత చెట్టు కింద నీడలో విద్యార్థులను కూర్చోబెట్టుకుని బేసిక్స్ రాయించడం చదివించడం జరిగింది..
ఒక వాట్సప్ గ్రూపును క్రియేట్ చేసుకుని పిల్లలకు ఎండాకాలంలో బయట తిరగకుండా ఉండడానికి తగు సూచనలు ఇస్తూ హోంవర్క్ ఇస్తూ ఎప్పటికప్పుడు వాకాబు చేస్తూ ఉంటారు దీనితో ఆ ఊరిలో ఉన్న తల్లిదండ్రులు అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.