తక్కువ ధరకే ఇసుక
ఇకపై తక్కువ ధరకే ప్రజలకు ఇసుకను అందిస్తాం
మహబూబాబాద్ బ్యూరో మే 19 నిజం న్యూస్
ఇసుక కొరత లేకుండా ఇకపై తక్కువ ధరకే ప్రజలకు ఇసుకను సరఫరా చేసే దిశగా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ శశాంక తెలిపారు.
శుక్రవారం ఐ డి ఓ సి లోని కలెక్టర్ సమావేశ మందిరంలో ఇసుక క్రమబద్దీకరణ పై జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ తో కలిసి సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… ప్రజలకు ఇసుక కొరత రాకుండా తక్కువ ధరకు అందించేందుకు ప్రణాళిక రూపొందించాలని అధికారులు ఆదేశించారు.
జిల్లాలో ఆకేరు మున్నేరు నదుల ద్వారా ఇసుక లభ్యమవుతుందన్నదని ఆయా మండలాలలోని తాసిల్దార్లు ఎస్సైలు గ్రామాలలో సమావేశాలు ఏర్పాటు చేసి అవగాహన పరచాలన్నారు.
Also read: చేతిలో రైఫిల్…..మెడలో స్టెతస్కోప్
ఇకపై అధికారికంగా ఇసుకను తక్కువ ధరకే అందించే విధంగా ప్రణాళిక రూపొందిస్తున్నందున ప్రజలు సహకరించాలన్నారు. ఇసుక విక్రయాల వల్ల సంబంధిత గ్రామపంచాయతీలకు మినరల్ ఫండ్స్ సమకూరతాయని తద్వారా గ్రామాభివృద్ధి వేగంగా ఉంటుందన్నారు.
జిల్లాలో తొర్రూరు నెల్లికుదురు నరసింహులపేట చిన్న గూడూరు మరిపెడ మండలాలలో ఇష్కరీచులను ఏర్పాటు చేస్తామని కలెక్టర్ తెలిపారు.
చెక్ డాంల నుండి కూడా ఇసుక తీయడం జరుగుతుందని సంబంధిత అధికారులు కూడా రీచ్ ఏర్పాటు చేయడానికి అనుమతిస్తామన్నారు.
ఇసుక కొరత రాకుండా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నందున అధికారులు పక్కా ప్రణాళికతో ముందుకు పోవాలన్నారు ఇసుక రీచ్ లకొరకు ఏర్పాటు చేసిన యాప్ల లపై ప్రజలకు అవగాహన పరచాలన్నారు.
ఈ సమావేశంలో ఆర్డిఓ లు కొమరయ్య రమేష్ ఏ ఎస్ పి చెన్నయ్య జిల్లా అధికారులు సిఐలు తాసిల్దారులు ఎస్సైలు మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.