Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

నేటి నుండి పలు ప్రాంతాల్లో వానలు

ద్రోణి ప్రభావంతో రేపట్నుంచి పలు ప్రాంతాల్లో వానలు
భగభగల నుంచి కాస్త ఊరట

హైదరాబాద్‌ (నిజం న్యూస్‌) మే 18
భానుడి భగభగలతో అల్లాడిపోతున్న ప్రజలకు హైదరాబాద్‌ వాతావరణశాఖ చల్లటి వార్త అందించింది. రాష్ట్రంలో శుక్రవారం పొడి వాతావరణం ఏర్పడవచ్చని, శనివారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. దక్షిణ తెలంగాణ జిల్లాల్లో కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు అకడకడా కురుస్తాయని అంచనా వేసింది.

తూర్పు మధ్యప్రదేశ్‌ నుంచి విదర్భ మీదుగా తెలంగాణ వరకు సగటు సముద్రమట్టానికి 0.9 కి.మీ. ఎత్తులో విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వానలు పడతాయని పేర్కొన్నది. 3,4 రోజుల నుంచి ఎండలతో ప్రజలు అల్లాడిపోయారు. కొన్నిచోట్ల 46 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

ALSO READ: ఈగలు బాబోయ్ ఈగలు

ఈ నెల 29 వరకు ఎండలే
వాయవ్య దిశ నుంచి రాష్ట్రం వైపు తక్కువ ఎత్తులో వీస్తున్న గాలుల ప్రభావంతో రాష్ట్రం లో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు న మోదవుతున్నాయి. ఈ నెల 29 వరకు ఎం డలు దంచి కొడతాయని వాతావరణశాఖ హెచ్చరించింది.

ఉదయం వేళలో 40 నుంచి 46 డిగ్రీల మధ్య, మధ్యాహ్నం 43 నుంచి 44 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు ఉంటాయని హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉం డాలని సూచనలు జారీ చేసింది. ప్రజలు ఉద యం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వర కు బయట తిరగవద్దని ఆ శాఖ రాష్ట్ర సంచాలకురాలు నాగరత్న సూ చించారు.