Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఈగలు బాబోయ్ ఈగలు

– కొత్తూరు టిడ్కో గృహసముదాయంలో ఎక్కడ పడితే అక్కడ తేనె పట్టులా ఈగలు.
-పగలు ఈగలు,రాత్రి దోమలు నరకం చూపిస్తున్న వైనం
-ఈగల బెడదకు సమీపంలో ఉన్న కోళ్ల ఫారాలే కారణమా? లేక పారిశుద్ధ్య లోపమా? అర్థం కాని వైనం.
-కోళ్ల ఫారాల నుంచి గృహ సముదాయాలకు నిరంతరాయంగా దుర్గంధం వ్యాపించడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితి.
-అప్పుడప్పుడు ప్రజాప్రతినిధులు, పురపాలక సంఘ అధికారులు తమ గృహాలను సందర్శిస్తే బావుండును అంటున్న గృహవాసులు
-పారిశుధ్య సమస్య సైతం సమస్యగానే ఉందంటున్న టిడ్కోవాసులు
-శునకాల బెడద పై కూడా దృష్టి పెట్టాలంటున్న టిడుకో వాసులు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, మే 18,(నిజం న్యూస్) బ్యూరో , గవర వెంకటరమణ :: టిడుకో గృహ సముదాయంలో ఎక్కడ చూసినా ఈగలు ఈగలు. ఇవి పగ పట్టినట్లుగా తేనె తుట్టలా జనం చుట్టూ ముసురుతూ ప్రశాంతత కరువైయ్యేలా చేస్తున్నాయి. కూర్చోనివ్వవు, నిలబడినవ్వవు.

ఇక్కడ కోళ్ల ఫారాలు వల్ల ఇలా ఈగలు విపరీతంగా పెరిగిపోయాయని కొందరు, మున్సిపాలిటీ పారిశుధ్యం సరిగా పట్టించుకోవడం లేదని మరికొందరు అంటున్నారు. ఎవరు ఏమన్నప్పటికీ ఈగల సమస్య మట్టుకు పెద్ద సమస్యగానే మారింది.

ఇది ఇలా ఉండగా కోళ్ల పారాల నుంచి నిరంతరం వ్యాపించే దుర్గంధం ఇక్కడి ప్రజలకు ప్రకృతి ప్రసాదించిన స్వచ్ఛమైన ఆక్సిజన్ పీల్చుకోనేందుకు తీవ్రమైన అవరోధాన్ని కలిగిస్తోంది.

ALSO READ: అమాయక ప్రజలే టార్గెట్

ఇలా అయితే రోగాల బారినపడే ప్రమాదం ఉందని భయాందోళన చెందుతున్నారు. మరోవైపు పంట పొలాలకు కోతలు పూర్తి కావడంతో విపరీతంగా దోమలు చేరి రాత్రులు కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయి. ఇటీవల శునకాలు కూడా పెరిగిపోవడంతో ప్రజలకు ఇబ్బందికరంగా ఉంటోంది.

కావున శునకాల సమస్యను కూడా లెక్కలోకి తీసుకోవాల్సిందిగా ప్రజలు మున్సిపాలిటీని విన్నవించుకుంటున్నారు. అలాగే నెలకో, 15 రోజులకో ఒకసారి ప్రజాప్రతినిధులుగాని, పురపాలక సంఘ ఉన్నతాధికారులు గానీ తమ గృహాలకు విచ్చేసి తమ స్థితిగతులను, జీవన విధానాన్ని స్వయంగా వీక్షించవలసిందనీ రామచంద్రపురం టిడ్కో గృహ నివాసులు వేడుకుంటున్నారు.