అమాయక ప్రజలే టార్గెట్

ముదిగుబ్బకు చెందిన గోవింద నాయక్ అరెస్టు చేసి. 21 లక్షల దొంగ నోట్లు. 50 గ్రాముల ఒరిజినల్ బంగారు , 287 గ్రాముల నకిలీ బంగారు హుండాయి కారు ను స్వాధీనం చేసుకున్న పోలీసులు.
ముదిగుబ్బ మే 18 (నిజం న్యూస్)
శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం ముదిగుబ్బ వద్ద పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో భారీగా నకిలీ కరెన్సీ, బంగారం పట్టుబడింది. ముదిగుబ్బ గ్రామానికి చెందిన నిందితుడు గోవింద నాయక్ అమాయక ప్రజలను టార్గెట్ చేసి నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్నట్లు పోలీస్ విచారణలో వెల్లడైంది.
గోవింద నాయక్ అదుపులోకి తీసుకున్న పోలీసులు అతని వద్ద నుండి 21 లక్షల నకిలీ నోట్లు, 50 గ్రాముల ఒరిజినల్ బంగారం . 287 గ్రాముల నకిలీ బంగారం. హుండాయి కారు స్వాధీనం చేసుకున్నారు.
ALSO READ: నన్ను ఎలా వాడుకోవాలో …వీళ్లకు తెల్వదు
నిందితున్ని జిల్లా ఎస్పీ మాధవ రెడ్డి ఎదుట హాజరు పరిచి అరెస్టు చూపారు.
ఈ సందర్భంగా మీడియా సమావేశం లో ఎస్పీ మాధవరెడ్డి మాట్లాడుతూ నకిలీ నోట్ల చలామణి, తక్కువ ధరకే బంగారం వంటి చీటింగ్ లను సీరియస్ గా పరిగణిస్తామన్నారు.
ఒరిజినల్ బంగారం చూపి నకిలీ బంగారు తక్కువ ధరకే అమ్ముతామని చెప్పి అదేవిధంగా బంగారు కొని నకిలీ నోట్లు చలామణి చేస్తున్న వ్యక్తి అరెస్ట్ చేసినట్లు ఎస్పి పేర్కొన్నారు.
నోట్లు చలామణి కి కారు ఉంచిన నగదు తో పాటు బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పి తెలిపారు.
అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్టవేస్తామని ఎస్పీ హెచ్చరించారు. ఎవరైనా జిల్లా లో తక్కువ ధరకు బంగారం అంకుతామని వస్తె మోసపోవద్దు అని వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్పి సూచించారు.
నకిలీ నోట్లు పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించిన పోలీసులను జిల్లా ఎస్పీ మాధవరెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.