Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

నన్ను ఎలా వాడుకోవాలో …వీళ్లకు తెల్వదు

కాంగ్రెస్ లో కొలాహలం .
నన్ను ఎలా వాడుకోవాలో
ఇప్పుడున్న ఇంఛార్జిలకు తెల్వదు .
సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ….

సంగారెడ్డి మే 18 ( నిజం న్యూస్ )
సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి ,మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీకి సేవలందించేందుకు సిద్దంగా ఉన్న తన లాంటి వారిని ఎలా వాడుకోవాలో ,ఇప్పుడున్న, ఇంఛార్జిలు తెలుసుకోకపోవడం దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు.
2017లో సంగారెడ్డిలో రాహుల్ గాంధీ సభ నిర్వహించినప్పుడు ఆ సభ ఖర్చు అంత తానే భరించానన్న జగ్గారెడ్డి. ఆ గుర్తింపు ఇప్పుడు ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు.

రాహుల్ గాంధీ.నన్ను పిలిచి అభినందించారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణలోని సంగారెడ్డిలో కూడా 25 కిలో మీటర్లు కొనసాగి మహారాష్ట్రకు వెళ్లిందని, అప్పుడు తాను సంగారెడ్డిలో ఉదయం 5 గంటలకేభారీ ఎత్తున రాహుల్ గాంధీకి స్వాగతం పలికానన్నారు.

ALSO READ: స్పీడ్ పోస్ట్ రాలేదని ఇంటర్నెట్లో కస్టమర్ కేర్ నెంబర్ కోసం సెర్చ్ చేస్తున్నారా! జాగ్రత్త
అప్పుడు పెట్టిన ఖర్చు కూడా తనదేనని ఆయన స్పష్టం చేశారు. అప్పట్లో స్వయంగా రాహుల్ గాంధీనే తనను పిలిచి చాలా బాగా చేశారని అభినందించినట్లు జగ్గారెడ్డి తెలిపారు.

గాంధీభవన్లో కూర్చొని ఆనందించే పరిస్థితి లేకుండా పోయిందని. తప్పని పరిస్థితుల్లో మీడియా ద్వారా ఈ ఒక్క మాట కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు తెలియచేస్తున్నట్లుజగ్గారెడ్డి వివరించారు.

గడిచిన ఐదు నెలలుగా
తాను రాజకీయంగా గాంధీభవన్ కు రాలేని పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది చాలా బాధగా ఉందని అన్నారు.

పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లయితే తాను గాంధీభవన్లో కూర్చొని తనకున్న సమస్యలను మర్చిపోయేవాడినని పేర్కొన్నారు. ఇవాళ ఆలాంటి పరిస్థితులు లేకుండా పోయినట్లు కాంగ్రెస్ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.