తొలి బంతి నుంచే ఇది విరాట్ రోజు అని అర్థమైంది…సచిన్
విరాట్ ఆ కవర్ డ్రైవ్ ఆడిన తొలి బంతి నుంచే ఇది విరాట్ రోజు అని స్పష్టంగా అర్థమైందని సచిన్ టెండూల్కర్ తన ట్విట్టర్లో రాసాడు. ఇంకా ఇలా రాసాడు.
విరాట్, ఫాఫ్ ఇద్దరూ బ్యాటింగ్ ను పూర్తి నియంత్రణలో చేసారు. వారు చాలా పెద్ద షాట్‌లు ఆడడమే కాకుండా విజయవంతమైన భాగస్వామ్యాన్ని నిర్మించడానికి వికెట్ల మధ్య బాగా పరిగెత్తారు.
వారిద్దరూ బ్యాటింగ్ చేసిన విధానానికి 186 పెద్ద మొత్తం కాదు. అని రాసుకొచ్చాడు.
ALSO READ: ఒకే మ్యాచ్ లో రెండు సెంచరీలు
గురువారం హైదరాబాద్, బెంగుళూరు మధ్య జరిగిన మ్యాచ్ లో విరాట్ 62 బంతుల్లో 100 పరుగులు చేసిన విషయం తెలిసిందే. అంతేకాక కోహ్లీ, పాప్ డుప్లెసిస్ లు మొదటి వికెట్ కు 172 పరుగుల బాగస్వామ్యాన్ని నెలకొల్పి తన జట్టు విజయం సాధించేలా చేసారు.
ఈ విజయంలో బెంగుళూర్ ప్లే ఆఫ్ కు పోయే అవకాశాలు మెరుగయ్యాయి.