ఈ నెల 20న 1000 థియేటర్లలో సింహాద్రి రీ రిలీజ్

ఈ నెల 20న జూ.ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా 2003లో రిలీజ్ అయి బాక్సాఫీస్ రికార్డులు బద్ధలు కొట్టిన సింహాద్రిని ఆయన అభిమానులు తెలుగు రాష్ట్రాల్లో 1000 థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. ఈ రిలీజ్ వేడుక హైదరాబాద్ లో జరిగింది. ఈ వేడుకకు యాంకర్ గా విశ్వక్ సేన్ వ్యవహరించాడు.
ఈ కార్యక్రమానికి టాలీవుడ్ అగ్ర నిర్మాతలు మైత్రీ నవీన్, గోపీచంద్ మలినేని ముఖ్య అతిధులుగా హాజరు అయ్యారు. ఇది పెద్ద వేడుకగా జరిగింది.
ALSO READ: ఒకే మ్యాచ్ లో రెండు సెంచరీలు
ఓవర్సీస్‌లో కూడా ఈ సినిమా రీ-రిలీజ్ కానుంది.
‘సింహాద్రి’ 2003లో ఎస్‌ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కింది . ఆ రోజుల్లో ఈ సినిమా విడుదలైన సమయంలో చాలా మంది అగ్ర తారల బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టి భారీ హిట్ గా నిలిచింది.
‘సింహాద్రి’కి కథను V. విజయేంద్ర ప్రసాద్ రాశారు. MM సంగీతం అందించారు.
ఫ్యామిలీ యాక్షన్ డ్రామా చిత్రంలో కీరవాణి, భూమిక చావ్లా, అంకిత కథానాయికలుగా నటించారు.