ఒకే మ్యాచ్ లో రెండు సెంచరీలు
సన్రైజర్స్ హైదరాబాద్ తో గురువారం హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లోని రెండో ఇన్నింగ్స్ లో విరాట్ కోహ్లీ 62 బంతులలో సెంచరీ సాధించాడు.
అంతకుముందు ముందుగా బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ క్లాసెస్ 51 బంతుల్లో 104 పరుగులు సాధించాడు. దీంతో హైదరాబాద్ జట్టు 186 పరుగులను చేయగలిగింది.
ఉప్పల్లో జరిగిన ఈ మ్యాచ్ లో ఒకేసారి ఇరుజట్ల ఆటగాళ్లు సెంచరీలను సాధించడం విశేషం.
Also read: సన్ రైజర్స్ పై కోహ్లీ సెంచరీ
సెంచరీ చేసిన తర్వాత బాలుకే సిక్స్ కొట్టే క్రమంలో ఔట్ అయ్యాడు.
కోహ్లీ, క్లాసెస్ లు సెంచరీ సాధించడంతో హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియంలో ప్రేక్షకులు కేరింతలు కొట్టారు.
మొదట బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ 20 ఓవర్లలో 186 పరుగులను చేసింది.
కోహ్లీ, డూప్లిసిస్ 172 పరుగుల భాగస్వామ్యాన్ని మొదటి వికెట్ కు నెలకొల్పి తమ జట్టును గెలిపించుకున్నారు. దీంతో ఐపీఎల్ పట్టికలో రాయల్ చాలెంజ్ జట్టు 4 స్థానానికి చేరింది.