సన్ రైజర్స్ పై కోహ్లీ సెంచరీ
సన్రైజర్స్ హైదరాబాద్ తో గురువారం హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ 62 బంతులలో సెంచరీ సాధించాడు.
కోహ్లీకి ఐపీఎల్లో ఇది ఆరవ సెంచరీ. నాలుగు సంవత్సరాల తర్వాత కోహ్లీ ఐపిఎల్ లో సెంచరీ సాధించాడు.
2019లో కోల్ కత్తా లో సెంచరీ సాధించాడు.
ఐపీఎల్ లో అత్యధిక సెంచరీలు సాధించి, క్రిస్ గేల్ రికార్డును సమం చేశాడు.
సెంచరీ చేసిన తర్వాత బాలుకే సిక్స్ కొట్టే క్రమంలో ఔట్ అయ్యాడు.
Also read: ఒలింపిక్స్ శిక్షణ కోసం రెండు కోట్లు ఇస్తా… బంగారు పతకం తేవాలి… సీఎం కేసీఆర్
కోహ్లీ సెంచరీ సాధించడంతో హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియంలో ప్రేక్షకులు కేరింతలు కొట్టారు.
మొదట బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ 20 ఓవర్లలో 186 పరుగులను చేసింది.
కోహ్లీ, డూప్లిసిస్ 172 పరుగుల భాగస్వామ్యాన్ని మొదటి వికెట్ కు నెలకొల్పారు.
ఈరోజు రెండు సెంచరీలను ఉప్పల్ స్టేడియంలో నమోదు కావడంతో ప్రేక్షకులకు కనువిందు చేశాయి.
అంతకుముందు హైదరాబాద్ బ్యాట్స్మెన్ క్లాసేన్ సెంచరీ సాధించాడు