Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

వడదెబ్బ లక్షణాలు ఇవి…. జాగ్రత్తలు ఇదిగో..

వడదెబ్బ సోకకుండా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి..

-ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ఇందురేఖ

ధర్మవరం మే 18 (నిజం న్యూస్): పట్టణ ప్రజలు వడదెబ్బ సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ, వైద్యుల సలహాలతో వైద్య చికిత్సలను పొందాలని పట్టణ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యురాలు ఇందు రేఖ తెలిపారు.

ఈ సందర్భంగా గురువారం వేసవి కాలమును దృష్టిలో ఉంచుకొని ప్రజలకు పలు విషయాలను వారు తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రస్తుతం ఎండ వేడిమి యొక్క ఉష్ణోగ్రత అధికంగా ఉన్నందున సాధ్యమైనంతవరకు ఇల్లు విడిచి బయటకు రారాదని తెలిపారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు అసలే బయటికి రారాదని తెలిపారు.

ఓ ఆర్ ఎస్ ప్యాకెట్టును సేవించాలని, త్రాగునీరును అధికంగా సేవించాలని, వడ దెబ్బ పై ప్రజలు తప్పనిసరిగా అవగాహన కల్పించుకుంటే ఆరోగ్యవంతులుగా ఉంటారని తెలిపారు.

కొబ్బరి నీరు, మజ్జిగ లాంటివి తీసుకోవాలని, కూల్ డ్రింక్స్ కు, మసాలా పదార్థాలకు దూరంగా ఉండాలని తెలిపారు. ఎండలో అధికంగా తిరిగితే వడదెబ్బ సోకుతుందని, తలకు టోపీ లేదా గొడుగు ధరించాలని తెలిపారు.

Also read: కీలక షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న పుష్ప-2

పలుచటి నూలు వస్త్రాలు మాత్రమే ధరించాలన్నారు. తలనొప్పి ,తల తిరగడం, అధిక జ్వరం, నీరసం, నాలుక ఎండిపోవుట, మగతగా ఉండుట, స్పృహ కోల్పోవుట లాంటివి వడదెబ్బ లక్షణాలని తెలిపారు.

ఈ లక్షణాలు కనబడితే వెంటనే నీడ ఉన్న చోటికి ఆ వ్యక్తిని చేర్చి, దగ్గరలో గల ప్రభుత్వ ఆసుపత్రికి లేదా పట్టణ ఆరోగ్య కేంద్రాలకు చేర్చాలని తెలిపారు

ఎండాకాలంలో నిర్లక్ష్యంగా తిరిగితే వడ దెబ్బ సోకడంతో పాటు ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉందని తెలిపారు. కావున పట్టణ ప్రజలు వడదెబ్బ శోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వారు మరోసారి సూచించారు.