మే 18న మామ, అల్లుళ్ల కొత్త సినిమా టైటిల్, ఫస్ట్ లుక్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్‌తో కలిసి సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే . ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌ని మే 18 గురువారం విడుదల చేయనున్నారు.
జీ స్టూడియోస్ విడుదల తేదీని, టైటిల్ విడుదల తేదీని ప్రకటించింది.
ఈ చిత్రాన్ని జూలై 28న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
ఈ చిత్రం తమిళ సూపర్‌హిట్ చిత్రం ‘వినోదయ సితం’కి అధికారిక రీమేక్.
ALSO READ: 10 కోట్ల మార్క్‌కు చేరువలో కస్టడీ
ఒరిజినల్ తమిళ వెర్షన్‌కి దర్శకత్వం వహించిన సముద్రఖని దీనికి కూడ దర్శకత్వం వహిస్తున్నాడు.
ఓక వ్యక్తి తన మరణానంతరం గతంలో తాను చేసిన తప్పులను సరిచేసుకోవడానికి రెండవ అవకాశం ఇస్తే ఎలా ఉంటుంది అన్నదే కథ. ఇది అహంకారి చుట్టూ కథ తిరిగే కథ. ఫాంటసీ డ్రామా.
తమిళంలో ఈ సినిమా మంచి ప్రజాదరణ పొందింది.
తెలుగు రీమేక్‌లోన ప్రియా ప్రకాష్ వారియర్, కేతిక శర్మ, రోహిణి, బ్రహ్మానందం, సుబ్బరాజులు నటిస్తున్నారు.