తల్లికి తలకొరివి పెట్టిన కూతురు గౌతమి

తల్లికి తలకొరివి పెట్టిన కూతురు గౌతమి
గార్ల,మే 17, నిజం న్యూస్:-
మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం గార్ల దళిత కాలనీకి చెందిన జీవంజి పల్లెలో, గిన్నారపు కుమారస్వామి భార్య కళావతి 35,సం, అనే మహిళ ఆకస్మాత్తుగా బుధవారం నాడు మరణించడం జరిగినది.
మృతురాలికి ఇద్దరు కూతుర్లు రేవతి గౌతమి కలరు. ప్రస్తుతం సమాజంలో అనేక సంవత్సరాలుగా మగవారు తల కొరవి పెట్టే ఆచారం ఉన్నందున, తల్లిదండ్రులకు ఆడ సంతానం కలిగిన తల్లిదండ్రుల అనేకమంది తలకొరివి ఎవరు పెడతారని బాధతో ఎదురుచూస్తున్న తల్లిదండ్రులకు,
Also read: భగీరధ పైపుకు తగిలి పల్టీ కొట్టిన కారు
మరణించిన కళావతి చిన్న కూతురైన గౌతమి తలకోరివి పెట్టుటకు ముందుకు వచ్చి గ్రామంలో చనిపోయిన తల్లికి తల కొరివి పెట్టి ఆదర్శప్రాయంగా, ఆదర్శంగా, నిలిచారు.