భగీరధ పైపుకు తగిలి పల్టీ కొట్టిన కారు
వైష్ణవి రైస్ మిల్ పక్కన భగీరధ పైపును డీ కొట్టి పల్టీ కొట్టిన కారు.
ముగ్గురికి తీవ్ర గాయాలు
మరొకరి పరిస్థితి విషమం.
మిషన్ భగీరథ పైప్ లైన్ పగిలి భారీగా ఎగిసిపడుతున్న వాటర్.
నేరేడుచర్ల, మే 15: నిజం న్యూస్ నేరేడుచర్ల మున్సిపాలిటీ పరి ధిలోని ఎన్టీఆర్ నగర్ వద్ద బుధవారం రాత్రి కారు మిషన్ భగీరధ పైపులైన్ ను డీ కొట్టి పల్టీ కొట్టడంతో న లుగురికి తీవ్ర గాయాలైనట్లు నేరేడుచర్ల ఎస్ఐ నవీన్ కుమార్ తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
కడప జిల్లా చెన్నూరు మండలం బైనపల్లి కొండపేట గ్రామానికి చెందిన నార చిన్న కృష్ణారెడ్డి 48 భార్య శశికల (41) త 15 ఏళ్లుగా ఖమ్మంలో వ్యాపారం చేస్తున్నా రు. నెల రోజుల క్రితం స్వగ్రామం బైనపల్లికి వెళ్లారు. అక్కడి నుంచి ఖమ్మంకు బయలు దేరి వెళుతుండగా మార్గమధ్యలో నేరేడుచర్లలో రోడ్డు ప్రమాదానికి గు రాయ్యరు.
ALSO READ: ప్రజలకు పోలీస్ శాఖను మరింత చేరువ చేయడమే లక్ష్యం
రహదారి పక్కన ఉన్న మిషన్ భగీరధ పైప్ లైన్ న్ను కారు అదుపుతప్పి ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో కారు పల్టీ కొట్టడంతో అందులో ఉన్న నలుగు రికి తీవ్ర గాయాలయ్యాయి. కృష్ణారెడ్డికి తల పగిలి తీవ్ర గాయాలు అయ్యాయి.
శశికల భుజంకు తీవ్ర గాయాలు కాగా కుమార్తెలకు గాయాలయ్యాయి. భగీరధ ఫైప్ పగలడంతో నీరు ఎగిసిపడుతుంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విద్యుత్ సరఫరా నిలిపివేశారు.
108కి సమాచారం అందించడంతో గాయాలైన వ 108 దమి చికిత్స జరిపి మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించా రు. కృష్ణారెడ్డికి తీవ్రగాయాలుండడంతో అతన్ని హై ద్రాబాద్కు తరలించనున్నట్లు ఎస్ఐ తెలిపారు.
భగీరధ నీటిని పూర్తిగా నిలిపివేశారు. అనంతరం విద్యుత్ పునరుద్ధరించారు. పూర్తి వివరాలు సేకరిస్తున్నామని, కేసు నమోదు చేయనున్నట్లు ఎస్ఐ తెలిపారు.