లింగనిర్ధారణ పరీక్షలు చేస్తున్న ప్రభుత్వ వైద్యురాలు… సస్పెన్షన్

హుజూరాబాద్ ప్రభుత్వ ఆస్పత్రి వైద్యురాలి సస్పెన్షన్
జమ్మికుంట మే 17 (నిజం న్యూస్)
హుజూరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో గైనకాలజీ విభాగ సర్జన్ గా విధులు నిర్వర్తిస్తున్న డాక్టర్.ఎం.లావణ్యను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ తెలంగాణ వైద్య విధానపరిషత్ కమిషనర్ రమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
జమ్మికుంటలోని తన విజయసాయి ఆసుపత్రిలో అనుమతి లేకుండా అల్ట్రా సౌండ్ స్కానింగ్ నిర్వహించడం, లింగ నిర్ధారణ, గర్భవిచ్ఛిత్తి చేయడంపై డీఎంహెచ్ లలితాదేవి ఇచ్చిన నివేదిక ప్రకారం ఈ ఉత్తర్వులు ఇచ్చారు.
ALSO READ: జాతీయ రహదారిపై పట్టుబడిన ఫేక్ కరెన్సీ, నకిలీ బంగారం
ఈ నెల 15న జమ్మికుంట మండలం లో ప్రైవేట్ హాస్పిటల్స్ సప్తగిరి, మమత, మరియు విజయసాయి హాస్పిటల్ లను వైద్య శాఖ అధికారులు తనిఖీ చేయగా విజయ సాయి హాస్పిటల్ లో లింగనిర్ధారణ పరీక్షలు చేస్తూ పట్టుబడ్డ సంగతి తెలిసిందే. దీంతో వైద్యాధికారులు అప్పటికప్పుడే స్కానింగ్ రూమ్ ను సీజ్ చేసారు.