జాతీయ రహదారిపై పట్టుబడిన ఫేక్ కరెన్సీ, నకిలీ బంగారం

శ్రీ సత్య సాయి పుట్టపర్తి మే 17 ( నిజం న్యూస్) జాతీయ రహదారిపై బుధవారం తనిఖీలను నిర్వహిస్తుండగా పెద్ద ఎత్తున నకీలీ నోట్లు, బంగారం పట్టుబడిన సంఘటన చోటు చేసుకుంది. సీఐ తెలిపిన వివరాల ప్రకారం
ముదిగుబ్బ జాతీయ రహదారిపై వాహనాల తనిఖీలు చేస్తుండగా కదిరి మండలం కుమ్మర వాండ్లపల్లికి చెందిన గోవింద నాయక్ కారులో తరలిస్తున్న 21 లక్షలు నకిలీ నోట్లు, 287 గ్రాములు నకిలీ బంగారం, 50 గ్రాములు ఒరిజినల్ బంగారం, కారును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.
ALSO READ: రక్త పోటు పై ప్రజలకు అవగాహన అవసరం
వీరు నకిలీ నోట్లను, బంగారంను ఎక్కడికి తరలిస్తున్నారు. ఎందుకు తరలిస్తున్నారన్న విషయంను విచారణలో తెలుసుకుంటామని తెలిపారు.