Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

గోదావరి జిల్లాలో… భానుడి భగభగలు

*విపరీతతమైన ఉక్కపోత
*హద్దు అదుపు లేని కరెంటు కోత
*అప్రకటిత కరెంటు కోతపై ముందే కలం ఝుళిపించిన నిజం
*ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయని అధికారులు

ఉమ్మడి తూర్పుగోదావరి
(బిక్కవోలు మండలం )
మే 17.. నిజం న్యూస్…

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఎండలు చుర్రు మంటున్నాయి.

ఉదయం 10 నుండి సాయంత్రం 5 గంటల మధ్యలో భానుడి భగభగలు తట్టుకోవడం ప్రజలకు ప్రాణసంకటంలా మారింది. జిల్లాలో రోడ్లు అన్ని నిర్మానుష్యంగా మారిపోతున్నాయి.తప్పనిసరి పరిస్థితులలోనే ప్రజలు ఇంటి నుండి కదిలే పరిస్థితి నెలకొంది.

ALSO READ: ఐలాపూర్, ఐలాపూర్ తాండ బాధితులకు న్యాయం చేస్తాం..

రోహిణి కార్తి రాకుండానే పెద్ద కత్తెరగా పిలవబడే ఈ సమయంలో వడగాల్పులు, ఎండ తీవ్రత ఇలా ఉంటే ముందు ముందు రోహిణి కార్తి ఎలా ఉంటుందో అని ప్రజలు బెంబేలు పడుతున్నారు.

మంగళవారం రాజమండ్రినందు 48 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కావడం ఈ పరిస్థితికి నిదర్శనం.ముఖ్యంగా వృద్ధులు,పసిపిల్లలు,గర్భిణీ స్త్రీలు ,రోగులు ఎండ బారిన పడకుండా చూసుకోవాలని నిపుణులు చెపుతున్నారు.

తప్పనిసరి పరిస్థితులలో ప్రయాణం చేసే వారు తలకు టోపీ,రుమాలు ధరించాలని,అలాగే తప్పనిసరిగా మంచి నీళ్లు తీసుకుని వెళ్ళాలనే ప్రతీ ఒక్కరూ పాటించాలి.