Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

బ్లాక్ స్పాట్స్ ను సందర్శించిన ఇంజనీర్లు, పోలీస్ అధికారులు

ఖమ్మం బ్యూరో మే 17 (నిజం న్యూస్)
వాహన ప్రమాదాలను అరికట్టే దిశగా మరింత పటిష్టమైన భద్రత చర్యలు చేపట్టాలని పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ పోలీస్ అధికారులకు ఆదేశించడంతో బుధవారం ఖమ్మం నుండి వైరా ప్రధాన రహదారిపై జరుగుతున్న ప్రాణాంతక ప్రమాదాలకు కారణమయ్యే కారకాలను విశ్లేషించేందుకు ఖమ్మం ట్రాఫిక్ ఏసీపీ రామోజీ రమేష్, వైరా ఏసీపీ రహెమాన్, ఎన్ హెచ్ ఏ ఐ మేనేజర్ పద్మావతి, డి ఈ సూరిబాబు,ఇంజనీరింగ్ విభాగం అధికారులు కొణిజర్ల రహదారిపై ప్రమాదాలు జరిగే 6 బ్లాక్ స్పట్ ప్రాంతాలను సందర్శించి విశ్లేషించారు.

ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ …
జిల్లా రహదారుల భద్రతా సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో జిల్లాలో చోటు చేసుకునే రోడ్డు ప్రమాదాలను పోలీస్‌, రవాణా, ఇంజినీరింగ్‌, ఆరోగ్య శాఖల అధికారులు ఇంటిగ్రేటెడ్‌ రోడ్‌ యాక్సిడెంట్‌ డేటా బేస్‌ (ఐరాడ్‌) ద్వారా కారణాలు తెలుసుకుని నివారకు ముందస్తు చర్యలు చేపట్టినప్పటికి అత్యధిక శాతం రోడ్డు ప్రమాదాల కారణంగానే ప్రాణాలు కోల్పోవడంతో అధికారులు రహదారుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు.

జిల్లాలో గుర్తించిన 68 బ్లాక్‌ స్పాట్స్‌ను ఆయా శాఖల వారిగా బ్లాక్‌ స్పాట్లలో బ్యారికేడింగ్‌, ప్రమాద సంకేత సూచిక బోర్డులు, స్టాపర్స్‌, సిగల్‌ లైట్స్‌, బ్లింకింగ్‌ లైట్స్‌ ఏర్పాటు చేసి ప్రమాద నివారణ చర్యలను చేపట్టినట్లు తెలిపారు.

వాహనాలలో అధిక లోడుతో సరుకు, ఇతర సామగ్రి రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవలసిందిగా పోలీస్ అధికారులను ఆదేశించారు.

ALSO READ: ఐటిఐ ప్రవేశాల కోసం దరఖాస్తుల ఆహ్వానం

సెల్‌ ఫోన్‌లో మాట్లాడుతూ డ్రైవింగ్‌ చేయడం వల్ల కూడా ప్రమాదాలు సంభవిస్తాయని,
ఈ ఏడాది నాలుగు నెలలలో
టూ, త్రీ వీలర్స్‌, 4 వీలర్స్‌, ట్రాక్టర్లు, టెంపోలు, టిప్పర్లు, బస్సు,లారీలు తదితర 250 రోడ్డు ప్రమాదాలు సంభవించగా, 78 మంది మృతిచెందగా, 247 మంది దృష్టికి గాయపడ్డారని వివరించారు. అతివేగం, నిర్లక్ష్యంగా రాష్‌ డ్రైవింగ్‌ చేయడం ప్రమాదానికి కారణమని నివేదికలు చెపుతున్నాయని. ద్విచక్ర వాహనదారులు ఎక్కువగా ప్రమాదాలకుగురవుతున్నారని, అధిక లోడుతో వెళ్లే లారీలు, సామర్ధ్యం మించి ఆటోలలో ప్రయాణికులను ఎక్కించుకోవడం వల్ల అనుకోని సంఘటనలతో ప్రమాదాలు సంభవించాయని పరిశోధనలో వెల్లడైనట్లు పేర్కొన్నారు.

హెల్మెట్లు ధరించి ప్రయాణించడం వల్ల ప్రమాదాల తీవ్రత తగ్గుతుందని ఈ మేరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. అధిక లోడు, ఆటోలో సామర్థ్యానికి మించి ప్రయాణికులు ఎక్కకుండా, ద్విచక్ర వాహనదారులు ప్రతి ఒక్కరు రోడ్డు భద్రతా ప్రమాణాలు పాటించేలా విద్యార్థులతో, స్వచ్ఛంద సంస్థలతో అవగాహన ర్యాలీ నిర్వహించాలని సూచించారు.

పెద్ద వాహనాలు, ట్రిప్పర్లు, ట్రాక్టర్లు, ఇతర వాహనాలకు వెనుక వైపు రేడియం స్టిక్కర్‌లు తప్పనిసరిగా ఉండాలని, లేని వాహనాలు ఎక్కువగా ప్రమాదాలకు గురవుతున్నట్లు
చెప్పారు. ఎక్కడైనా వాహనం బ్రేక్డౌన్‌ అయిన అప్పుడు పక్కన రాళ్లు చెట్టుకొమ్మలు పెడుతున్నారని, రాత్రి సమయాలలో అవి కనపడక ఆగి ఉన్న వాహనాలను ఢకొీట్టడం జరుగుతోందని, దానివల్ల కూడా ప్రమాదాల తీవ్రత పెరుగుతోంది అన్నారు..
కార్యక్రమంలో పి ఆర్ ఓ