నూతన కథకు ప్రాణం పోసారు..Jr. NTR
స్వప్న సినిమా ఎంటర్టైన్మెంట్ పై నిర్మిస్తున్న అన్ని మంచి శకునములే సినిమా ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ పై జూనియర్ ఎన్టీఆర్ స్పందిస్తూ…
కొత్త, సృజనాత్మక కథలను రూపొందించడంలో తన హృదయాన్ని కురిపించే నా ప్రియమైన స్నేహితురాలు స్వప్నకు, ఈ రిఫ్రెష్ కథకు ప్రాణం పోసిన ప్రియాంక, నందిని గార్లకు ఆల్ ది బెస్ట్. మొత్తం తారాగణం, సిబ్బందికి శుభాకాంక్షలు…NTR.
జూనియర్ ఎన్టీఆర్ స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాకు వీరు నిర్మాతలు. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ ఇక వెను తిరిగి చూడాల్సిన అవసరం లేకుండా పోయింది.
స్వప్న సినిమా బ్యానర్లు మొదటి సినిమా, ఎన్టీఆర్ మొదటి హిట్ సినిమా. స్టూడెంట్ నంబర్ 1 తర్వాత ఎన్టీఆర్ ఎవరే సుబ్రహ్మణ్యం ప్రమోషన్ లో విస్తృతంగా పాల్గొని ఆ సినిమా మంచి ఫలితాన్ని రాబట్టడానికి కారణమయ్యాడు.