Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

నవంబరు 4 నుంచి మహిళల ఛాలెంజర్‌

మహిళల మినీ ఐపీఎల్‌ ఛాలెంజర్‌ సిరీస్‌ను నవంబరు 4 నుంచి 9 వరకు యూఏఈలో నిర్వహించే అవకాశముంది. మూడు జట్లతో నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌ జరపాలని బీసీసీఐ ఓ నిర్ణయానికి వచ్చినట్లు ఐపీఎల్‌ వర్గాలు పేర్కొన్నాయి. ‘‘ఛాలెంజర్‌ సిరీస్‌లో భాగంగా ట్రయల్‌బ్లేజర్స్‌, వెలాసిటీ, సూపర్‌నోవాస్‌ జట్ల మధ్య ఒక రౌండ్‌ రాబిన్‌ లీగ్‌ నిర్వహిస్తారు. ఫైనల్‌తో సహా మొత్తం 4 మ్యాచ్‌లు జరుగుతాయి. నవంబరు 9న ఫైనల్‌ నిర్వహిస్తాం’’ అని ఐపీఎల్‌ అధికారి తెలిపాడు.