పొలంలో మంటలు ఆర్పడానికి వెళ్లి అదే మంటల్లో …
పొలంలో మంటలు ఆర్పడానికి వెళ్లి అదే మంటల్లో పడి వ్యక్తి మృతి
గరిడేపల్లి మండలం 16 (నిజం న్యూస్) ప్రతినిధి:ఉపాధి హామీ పనులకు వెళ్లివస్తు తన పొలంలో వరి కొయ్యలకు మంటలు అంటుకోవడం చూసి ఆ మంటలకు అర్పడానికి వెళ్లి ప్రమాద వశాత్తు అదే మంటల్లో పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని అపన్న పేట గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది.
ALSO READ: అంగన్వాడీ కేంద్రంలో..వేయింగ్ మెషీన్ తాడును మెడకు చుట్టుకుని… తొమ్మిది సంవత్సరాల బాలుడు
ఎస్సై వెంకట్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన గోళ్ళ గంగయ్య (59) అప్పన్నపేట గ్రామ సమీపంలో గల నంద్యాల శేషి రెడ్డి వ్యవసాయ పొలం సమీపంలో ఉపాధి పని చేయడానికి వెళ్ళిడూ ఆ సమయంలో కొంత దూరాన మంటలు వ్యాపిస్తుండగా అక్కడ పక్కనే తన పొలం ఉన్నందున తన పొలంలోని వాటర్ పైపులకు మంటలు అంటుకుంటాయేమోనని అక్కడికి వెళ్లాడు.
పక్కనే ఉన్న బెమ్మేడి చెట్ల కొమ్మలు విరిచి వాటితో మంటలను ఆర్పే ప్రయత్నం చేయగా మంటలు చుట్టుముట్టి ఆ మంటలలో పడి కాలి మృతి చెందాడని మృతుని భార్య గోళ్ళ వీరమ్మ ఫిర్యాదు మేరకు కేస్ నమోదు చేసి ధర్యాప్తు చేయడం జరుగుతుందిని యస్ ఐ తెలిపారు.
మృతునికి కుమారుడు ఉన్నాడు