అంగన్వాడీ కేంద్రంలో..వేయింగ్ మెషీన్ తాడును మెడకు చుట్టుకుని… తొమ్మిది సంవత్సరాల బాలుడు
వేయింగ్ మెషీన్ తాడును మెడకు చుట్టుకుని తొమ్మిది సంవత్సరాల బాలుడు…
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, మే 16,(నిజం న్యూస్) బ్యూరో :: కాకినాడ జిల్లా కాజులూరు మండలం గొల్లపాలెం గ్రామంలో అంగన్వాడీ కేంద్రంలో మంగళవారం ఘోరమైన విషాదం చోటు చేసుకుంది.
గొల్లపాలెం పోలీస్ స్టేషన్ ఎస్ఐ తులసి రామ్ తెలిపిన కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కాజులూరు మండలం గొల్లపాలెం గ్రామంలో పేరి సత్తిబాబు కుమారుడు పేరి మనోజ్ చంద్రశేఖర్ (9) తన చెల్లెలతో స్థానిక అంగన్వాడీ కేంద్రానికి ఆటలాడుకోవడానికి వెళ్ళాడు.
ఆటలాడుకుంటూ అక్కడ ఎవరూ లేని సమయంలో పైనుంచి కిందకి వేలాడుతున్న వేయింగ్ మిషన్ తాడును మెడకు చుట్టుకుని ఊయల ఊగే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో వేయింగ్ మిషన్ తాడు మనోజ్ మెడకు బిగుసుకుపోయి ఊపిరి ఆడక ఉక్కిరిబిక్కి రయ్యాడు. చివరికి బాలుడు మనోజ్ ప్రాణాలు పోయాయి.
ALSO READ: ముంబాయికి ప్లే ఆఫ్ ఇక కష్టమే
మనోజ్ ఆకస్మిక మరణంతో గొల్లపాలెం, పరిసర ప్రాంతాలలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అనంతరం బాలుని కుటుంబీకులు గొల్లపాలెం పోలీస్ సషన్లో ఫిర్యాదు చేయడంతో పాటు బాలుని మృతదేహంతో అంగన్వాడి సెంటర్ ముందు బైఠాయించారు.
తమకు న్యాయం జరగాలని అంగన్వాడి సిడిపిఓ మాధవి తదితర అధికారులను బాలుని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. గొల్లపాలెం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాలుని ఆకస్మిక మరణంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై తులసీరామ్ తెలిపారు.