ముంబాయికి ప్లే ఆఫ్ ఇక కష్టమే
మంగళవారం లక్నోలోని ఎకానా స్టేడియంలో ఉత్కంఠభరితంగా జరిగిన పోటీలొ ముంబయి ఇండియన్స్‌పై ఐదు పరుగుల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్‌ఎస్‌జి) విజయం సాధించడంతో ప్లేఆఫ్స్‌లో మూడో స్థానానికి చేరుకుంది. LSG ఇప్పుడు 15 పాయింట్లతో రెండవ స్థానంలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ (CSK)తో సమానంగా ఉంది.
MI మ్యాచ్ ఒడిపోవడంతో ప్లేఆఫ్స్ అవకాశాలు చాలా కష్టంగా మారే అవకాశాలున్నాయి. ప్రస్తుతం ముంబాయి 4 వ స్తానంలో ఉంది.
SRHతో జరిగే చివరి మ్యాచ్‌లో MI గెలిచినప్పటికీ, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), పంజాబ్ కింగ్స్ (PBKS) తాము ఆడే రెండు గేమ్‌లను గెలిస్తే అవి 16 పాయింట్లను పొందే అవకాశం ఉంది. ఆ తర్వాత MI పెద్ద తేడాతో గెలిస్తే తప్ప అర్హత సాధించే అవకాశం లేదు.
RCB, PBKS రెండూ మంచి నెట్ రన్ రేట్ కలిగి ఉన్నాయి. మెన్ ఇన్ బ్లూ ఆదివారం SRHని ఓడించినప్పటికీ, LSG , CSK తమ చివరి గేమ్‌లో ఓడి పోయినా కూడా మొదటి రెండు స్థానాల్లో నిలిచే అవకాశం ఉంది.
ALSO READ: వాయువ్య దిశల్లో గాలులు…. ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం
మొదటి రెండు స్థానాల రేసుకు చెన్నై సూపర్ కింగ్స్ (సిఎస్‌కె)కు అవకాశం ఉంది.
శనివారం ఢిల్లీ క్యాపిటల్స్ (DC)తో జరిగిన మ్యాచ్‌లో గెలిస్తే సీఎస్కె క్వాలిఫైయర్ వన్‌లో చోటు దక్కించుకుంటుంది.