Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

వాయువ్య దిశల్లో గాలులు…. ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండుతున్నాయి.

సూర్యాపేట ప్రతినిధి మే 16 నిజం న్యూస్

రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జనం అల్లాడుతున్నారు. 44 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో.. బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితులు నెలకొన్నాయి.

ఈ క్రమంలో వాతావరణ శాఖ రాబోయే మూడు రోజులకు వాతావరణ పరిస్థితులను అంచనావేసింది.

Also read: కన్నీళ్లు పెట్టిస్తున్న తెల్ల బంగారం

ఆంధ్రప్రదేశ్, యానంలో దిగువ ట్రోపో ఆవరణములో పశ్చిమ / వాయవ్య దిశల్లో గాలులు వీస్తున్నాయని.. ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది.