Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

కన్నీళ్లు పెట్టిస్తున్న తెల్ల బంగారం

కన్నీళ్లు పెట్టిస్తున్న తెల్ల బంగారం.. పతనమవుతున్న పత్తి ధరలు.

జమ్మికుంట, మే 16 (నిజం న్యూస్)

తెల్ల బంగారం కన్నీళ్లు పెట్టిస్తోంది. పత్తి పంట ధరలు రోజులు గడుస్తున్నా కొద్దీ పతనమవుతూ రైతుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. ప్రకృతి వైపరిత్యాలు, తెగుళ్లు అన్నింటినీ ఎదుర్కొని పంట పండించి మార్కెట్‌కు తరలిస్తే కనీసం గిట్టుబాటు ధర కూడా రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కనీసం పెట్టుబడులు కూడా గిట్టుబాటు కాని ధరకు పత్తిని విక్రయించ లేక, పెట్టుబడి కోసం చేసిన అప్పులు, వడ్డీని తీర్చలేక రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. పంట సాగు తెచ్చిన అప్పులు, వాటి వడ్డీలు పెరుగుతుండటంతో తక్కువ ధరకే పత్తి దిగుబడిని విక్రయించే పరిస్థితులు దాపురించాయని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Also read: మరణం లోను వీడని స్నేహం

మంగళవారం జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ లో క్వింటాల్ పత్తి ధర రూ.7,300 చొప్పున పలికింది. వివిధ గ్రామాల నుంచి రైతులు 340 క్వింటాళ్ల లూజు పత్తిని మార్కెట్ కు తీసుకు రాగా.. క్వింటాల్ గరిష్ట ధర రూ.7,300, మోడల్ ధర రూ.7,200, కనిష్ట ధర రూ.6,600 చొప్పున పలికినట్లు అధికారులు ప్రకటన ద్వారా తెలిపారు. రైతులు నాణ్యమైన పత్తిని తీసుకొచ్చి మద్దతు ధర పొందాలన్నారు