Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

మరణం లోను వీడని స్నేహం

మరణం లోను వీడని స్నేహం

స్నేహితుని మరణ వార్త తట్టుకోలేక పంటలకు వాడే గడ్డి మందు తాగి ఆత్మహత్యకి పాల్పడిన మరొక స్నేహితుడు.

ఇద్దరి స్నేహితులని పక్కన పక్కనే పూడిచిన బంధువులు

*అయిజ రూరల్*:జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం బుంపురం గ్రామానికి చెందిన బోయ హనుమంతు,అనారోగ్య కారణంతో నిన్న సోమవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో హైదరాబాద్ లో తుది శ్వాస విడిచారు.అది తెలిసిన మరొక స్నేహితుడు వరుసకు బామర్ది అయినా బోయ హుసేని సోమవారం మధ్యాహ్నం వారి వ్యవసాయ పొలం గడ్డి మందు సేవించారు.గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం గద్వాల్ ప్రభుత్వ హాస్పిటలో సోమవారం సాయంత్రం చేర్పించారు.

మందు సేవించిన వ్యక్తికి సీరియస్ కావడంతో హుటాహుటిన కర్నూల్ ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు.హాస్పటల్ కు తరలించే లోపు మార్గం మధ్యలోనే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. ఆ గ్రామంలో గ్రామస్తుల ఎదుట మా బామ్మర్ది అయినా నా చిన్ననాటి స్నేహితుడు మృతి చెందాడని మానోభవానికి గురై నేను కూడా మరణిస్తానని గ్రామంలో కొందరితో చెప్పినట్లు స్థానికులు చెప్పుకొచ్చారు.

Also read: బాసరలో వివాహ వేడుకలో అగ్ని ప్రమాదం

మృతి చెందిన బోయ హనుమంతు అంతక్రియలు మంగళవారం మధ్యాహ్నం సమయం లో అంతక్రియలు నిర్వహించగా, ఆదే రోజు వారి చిన్ననాటి స్నేహితుడు అయినటువంటి బోయ హుసేని అంతక్రియలు కూడా సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో నిర్వహించినట్లు ఇరువురు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నేరుగా విలపిస్తూ ఇద్దరు చిన్ననాటి స్నేహితుల ను పక్కన పక్కనే గుంతలు దోగి పూడ్చారు.

అటుగా వెళ్తున్న స్థానికులు జిల్లాలో ఇలాంటి సంఘటన జరగడంతో అందరూ తీవ్ర అవేదానికి గురై, జిల్లాలో ఏ గ్రామంలో చూసినా ఇద్దరూ అనుబంధంపై చర్చించుకుంటున్నారు..