బాసరలో వివాహ వేడుకలో అగ్ని ప్రమాదం

బాసరలో వివాహ వేడుకలో అగ్ని ప్రమాదం
ఒక టెంటు, నాలుగు ద్విచక్ర వాహనాలు, కుర్చీలు దగ్ధం
ముధోల్ నియోజకవర్గ ప్రతినిధి మే 16 (నిజం న్యూస్)
నిర్మల్ జిల్లాలోని బాసర మండల కేంద్రంలో స్థానిక సరస్వతి కళ్యాణమండపంలో పెళ్లి వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది.
ALSO READ: మీకు రేషన్ ఇస్తే మా వారికి రేషన్ మిగలదు..?
పెళ్లి వేడుకలో భాగంగా టపాకాయలు పేల్చడంలో టెంట్ కు నిప్పు అంటుకుని , దాని ద్వారా సుమారు నాలుగు ద్విచక్ర వాహనాలు, కుర్చీలు, రెండు టెంట్లు దగ్దమయ్యాయి.
ఎవరికి ప్రాణ హాని కలగలేదు. వేసవి కాలం అవడంతో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో చిన్న నిప్పు రవ్వల వల్ల ప్రమాదం జరిగింది.