అవసరం ఉంటేనే బయటకి వెళ్ళండి
కారేపల్లి,మే16(నిజం న్యూస్):కారేపల్లి మండలంలో ప్రజలు వేసవి కాలంలో ఎండ తీవ్రంగా ఉండటంతో ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని, అత్యవసర పనులు ఉంటేనే బయటికి వెళ్లాలని కారేపల్లి మండల వైద్యాధికారి డాక్టర్ శ్రేష్ట అన్నారు.
మంగళవారం కారేపల్లి మండల ఆరోగ్య కేంద్రంలో ఆమె మాట్లాడుతూ ఎండ రెండు రోజులుగా ఎండ తీవ్రంగా ఉందని, ప్రజలు తగిన జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలన్నారు.
అధికంగా మంచినీరు తాగాలని, పళ్ళరసాలు, మజ్జిగ, నిమ్మరసం వంటివి సేవించవచ్చని అన్నారు.
బయటికి వెళ్ళినప్పుడు తెల్లటి దుస్తులను వాడాలని, కళ్లకు నల్లటి అద్దాలు ధరించాలని సూచించారు
ALSO READ: కేటీఆర్ కు ఫిర్యాదు… నిలిచిపోయిన మార్కెట్ కమిటీ ఎన్నిక