కేటీఆర్ కు ఫిర్యాదు… నిలిచిపోయిన మార్కెట్ కమిటీ ఎన్నిక

మధిర మార్కెట్ కమిటీ ఎన్నికపై సందిగ్ధత.
కేటీఆర్ కు ఫిర్యాదుతో నిలిచిపోయిన ఎన్నిక
మధిర మే 16 (నిజం న్యూస్)
ఎన్నికలు సమీపిస్తున్న కూడా గత కొన్ని నెలలుగా ఖాళీగా ఉన్న మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి నియామకం ముందుకు సాగటం లేదు.
దీనికి గల ప్రధాన కారణం నుండి కొంతమంది ముఖ్య నేతలు బి.ఆర్.ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అదేవిధంగా రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కు నేరుగా ఫిర్యాదు చేశారు.
దీంతో ఈ కమిటీ ఎన్నిక విషయం పక్కన పెట్టినట్టు తెలుస్తుంది.మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి మధిర నేతలకు పెద్ద తలనొప్పిగా మారింది.
ధనార్జనే ధ్యేయంగా ఒక వ్యక్తికి మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని కట్టబెట్టాలని చూస్తున్నారని నేరుగా కేటీఆర్ కు ఫిర్యాదు చేశారట,
అవసరమైతే మార్కెట్ కమిటీని నిలిపివేయాలని సూచించారట,దీంతో ప్రస్తుతం మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఎన్నిక వాయిదా పడినట్లే తెలుస్తుంది.
Also read: ఫోన్ లో మాట్లాడుతూ కుట్లు వెయ్యడం మర్చి పోయిన డాక్టర్…రక్త స్రావం తో బాలింత మృతి..!
బోనకల్లు మండలానికి చెందిన బీసీ సామాజిక వర్గానికి చెందిన ఒక నేతక కట్టబెట్టాలని అతని ద్వారా ఆర్థిక లాభాన్ని పొందాలని, కొంతమంది నేతలు భావించారు.
కానీ పార్టీలో తీవ్ర వ్యతిరేకత రావటంతో ఆ వ్యక్తి ఎంపికకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి.దీంతో ఆ నేతలు మల్ల గుల్లాలు పడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఇప్పట్లో ఎన్నిక కానట్లే తెలుస్తుంది.