ఫోన్ లో మాట్లాడుతూ కుట్లు వెయ్యడం మర్చి పోయిన డాక్టర్…రక్త స్రావం తో బాలింత మృతి..!
డాక్టర్ నిర్లక్ష్యంతో బాలింత మృతి
మహబూబాబాద్ బ్యూరో మే 16 నిజం న్యూస్
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ గుగులోత్ రవి నాయక్ నిర్లక్ష్యంతో 23 సంవత్సరాల బాలింత మృతి,
డెలివరీ కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన మరిపెడ మున్సిపాలిటీ కేంద్రానికి చెందిన v, భాగ్యలక్ష్మి అనే దళిత మహిళలకు చిన్న ఆపరేషన్ చెయ్యడం తో మగ బిడ్డకు జన్మని జన్మనిచింది
అదే క్రమంలో డాక్టర్ కు ఫోన్ రావడంతో కుట్లు వేసేది వదిలేసి 30 నిమిషాల వరకు ఫోన్ మాట్లాడుకుంటూ బయటికి వెళ్లిపోయాడు మహిళకు బ్లీడింగ్ కావడంతో స్పృహ తప్పింది
30 నిమిషాల తర్వాత డాక్టర్ వచ్చి కుట్లు వేషి ఇంజక్షన్ చేయడంతో సీరియస్ గా ఉందని గ్రహించిన డాక్టర్ మధ్యాహ్నం మూడున్నర వరకు సెలైన్ పెట్టాడు, అప్పటికి ఆ మహిళకు శ్వాస ఆడట్లేదు
Also read: 3 స్థానాలకు 6 జట్లు పోటీ
మరణించింది అని నిర్ధారణ చేసుకున్న డాక్టర్ తప్పించుకోవడం కోసం వెంటనే అంబులెన్స్ ను పిలిపించి, బలవంతంగా మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు,
ఇది మరిపెడ మున్సిపాలిటీ చైర్మన్ సింధూర కుమారి, భర్త, ప్రభుత్వ వైద్యాధికారి గుగులోత్ రవికుమార్ దళిత మహిళకు న్యాయం చేయ్యాలి అని ప్రజా సంఘాలు కుటుంబ సభ్యులు కోరుతున్నారు.