3 స్థానాలకు 6 జట్లు పోటీ
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లీగ్ మ్యాచ్‌లు చివరి వారంలో ప్రవేశించాయి . ప్లేఆఫ్ స్థానానికి ఒక్క గుజరాత్ టైటాన్స్ మాత్రమే చేరుకుంది. ఇంకా 8 మ్యాచ్‌లు మిగిలి ఉండగా చివరి దశకు చేరుకోవడానికి 6 జట్లు కుస్తీ పడుతున్నాయి.
ప్లేఆఫ్‌లు చేరగల 6 జట్లు ఏవో చూద్దాం..
గుజరాత్ టైటాన్స్ (13 మ్యాచ్‌లు, 18 పాయింట్లు)
మిగిలిన మ్యాచ్‌లు: RCB (మే 21 బెంగళూరులో)
GT ‘సోమవారం సన్‌రైజర్స్ హైదరాబాద్ తో గెలవడం తో నేరుగా ప్లే ఆఫ్ కు చేరుకుంది.
చెన్నై సూపర్ కింగ్స్ (13 మ్యాచ్‌లు, 15 పాయింట్లు)
మిగిలిన మ్యాచ్‌లు: vs DC (20 మే ఢిల్లీలో)
KKRతో ఓటమి తర్వాత, CSK ఇప్పటికీ ప్లేఆఫ్స్‌లో కి పోలేదు. శనివారం ఢిల్లీలో ఢిల్లీపై గెలిస్తే 17 పాయింట్లతో మొదటి నాలుగు స్థానాల్లో నిలవడం ఖాయం. DC ఒక వేళ CSKని ఓడిస్తే ఐదు జట్లు 15-ప్లస్ పాయింట్లతో పూర్తి చేయగలవు. CSK ఓడిపోయినప్పటికీ, ఫలితాలు అనుకూలిస్తే వారు మూడవ స్థానంలో కి రావచ్చు.
ముంబై ఇండియన్స్ (12 మ్యాచ్‌లు, 14 పాయింట్లు)
మిగిలిన మ్యాచ్‌లు: vs LSG (16 మే లక్నోలో), vs SRH (ముంబైలో మే 21)
MI సరైన సమయంలో ఫామ్ లో కి వచ్చింది . ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలతో ముంబై ఐపీఎల్‌లో సరైన సమయంలో దూసుకుపోతోంది. LSG , SRH పై విజయాలు సాధిస్తే 18 పాయింట్ల తో మొదటి-రెండు ప్లేస్ లో ఉంటారు. ఒక వేల LSG, SRHల్లో ఒక దానిపై ఒడిపోతే 16 పాయింట్లను పొందుతారు. అప్పుడు కూడ వీరు ప్లే ఆఫ్ కు చేరడానికి అవకాశం ఉంది. రెండింటి లో ఓడి పోతే మూడు జట్లు 14 లేదా అంతకంటే ఎక్కువ పాయింట్లతో ఉంటాయి. అవకాశాలు కఠినంగా మారతాయి. ముంబై యొక్క 14 పాయింట్లు, నెట్ రన్ రేటు (-0.117) అధ్వాన్నంగా ఉండటంతో ప్లే ఆఫ్ కు చేరడం కస్టమ్.
రాజస్థాన్ రాయల్స్ (13 మ్యాచ్‌లు, 12 పాయింట్లు)
మిగిలిన మ్యాచ్‌లు: vs PBKS (మే 19 ధర్మశాలలో)
RCB చేతిలో రాయల్స్ 112 పరుగుల తేడాతో పరాజయం పాలవడం తో అది నెట్ రన్ రేటు ను గణనీయంగా దెబ్బతీసింది. నెట్ రన్ రేటు +0.633 నుండి +0.140కి చేరుకుంది. పంజాబ్‌ను ఓడించి, ఇతర ఫలితాలు తమకు అనుకూలంగా వస్తే వారు ఇప్పటికీ అర్హత సాధించగలరు. RR కోసం ఉత్తమ దృష్టాంతం ఏమిటంటే, RCB ఒక వేల LSG, PBKS లతో జరిగే మ్యాచ్ లలో రెండింటిని ఓడిపోయినట్లయితే, SRH తన GT మ్యాచ్ లో ఓడి పోవడంతో , నాల్గవ స్థానంలో RR మరియు KKR మధ్య పోటీ ఉండనుంది. నెట్ రన్ రేటు లో రాయల్స్ మెరుగ్గా ఉంటుంది.
లక్నో సూపర్ జెయింట్స్ (12 మ్యాచ్‌లు, 13 పాయింట్లు)
మిగిలిన మ్యాచ్‌లు: vs MI (16 మే లక్నో), vs KKR (20 మే కోల్‌కతాలో)
LSG మిగిలిన రెండు మ్యాచ్‌లలో విజయంతో ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించగలదు. GT, CSK, MI, RCB మరియు PBKS అన్నీ 16-ప్లస్ పాయింట్లతో LSG ఆశలను దెబ్బతీసే అవకాశం ఉంది. కానీ MI, KKR ల పై గెలిస్తే లక్నో సూపర్ జెయింట్స్ 17 పాయింట్స్ తో నేరుగా ప్లే ఆఫ్ చేరుతుంది.
ALSO READ: సన్‌రైజర్స్ పై సెంచరీ చేసిన గిల్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (12 మ్యాచ్‌లు, 12 పాయింట్లు)
మిగిలిన మ్యాచ్‌లు: vs SRH (18 మే హైదరాబాద్‌లో), vs GT (మే 21 బెంగళూరులో)
RRపై RCB అద్భుతమైన విజయం సాధించడం తో IPL పాయింట్ల పట్టికలో ఐదవ స్థానానికి చేరారు. నెట్ రన్ రేటుని -0.345 నుండి 0.166కి పెంచారు. RCB మిగిలిన రెండు మ్యాచ్‌లను గెలిచినప్పటికీ, ప్లేఆఫ్‌లకు అర్హత పొందడం కస్టం . చివరి రెండు మ్యాచ్‌లలో మంచి విజయాలతో, RCB MI మరియు PBKS కంటే మెరుగైన స్థితిలో ఉండి వారు 16 పాయింట్లతో ఉంటారు.
కోల్‌కతా నైట్ రైడర్స్ (13 మ్యాచ్‌లు, 12 పాయింట్లు)
మిగిలిన మ్యాచ్‌లు: vs LSG (20 మే కోల్‌కతాలో)
ఆదివారం రాత్రి CSKని ఓడించి KKR పోటీలో కి వచ్చింది. శనివారం ఈడెన్ గార్డెన్స్‌లో ఎల్‌ఎస్‌జిపై గెలిస్తే 14 పాయింట్లకు చేరుకుంటుంది. కోల్‌కతా మూడు జట్లకు మించి 14 పాయింట్లకు రావద్దని కోరుకోవాలి . LSG తమ చివరి రెండు మ్యాచ్‌లలో ఓడిపోయినట్లయితే, RCB, PBKS మిగిలిన మ్యాచ్‌లలో కనీసం ఒక మ్యాచ్‌లోనైనా ఓడిపోయినట్లయితే అది జరగవచ్చు. 14 పాయింట్లతో ఒంటరి స్థానం కోసం నాలుగు జట్లు పోటీ పడవచ్చు. అటువంటి సందర్భంలో నెట్ రన్ రేటు రంగం లోకి వస్తుంది. KKR -0.256లో ఉంది. మెరుగుపరచడానికి ఒకే ఒక గేమ్ లో అవకాశం ఉంది.
పంజాబ్ కింగ్స్ (12 మ్యాచ్‌లు, 12 పాయింట్లు)
మిగిలిన మ్యాచ్‌లు: vs DC (17 మే ధర్మశాలలో), vs RR (ధర్మశాలలో 19 మే)
ఈ సీజన్‌లో 16-ప్లస్ పాయింట్‌లతో ముగించగల ఆరు జట్లలో PBKS ఒకటి. ఢిల్లీ, రాయల్స్‌ను ఓడించి 16-ప్లస్ పాయింట్లను స్కోర్ చేస్తే ఆరు జట్లలో ఉంటుంది. పంజాబ్ నెట్ రన్ రేటును (-0.268) కలిగి ఉంది. రెండు మ్యాచ్‌ల్లో ఏదో ఒక మ్యాచ్‌లో ఓడిపోతే 14 పాయింట్లకు చేరుకుని చివరి స్థానం కోసం పోటీ పడనుంది .
ALSO READ: ఐదు వికెట్లు తీసిన భువనేశ్వర్ కుమార్