వాటిని తెగ తినేస్తున్నారు

దేశ ప్రజలు చిరుతిళ్లను ఎక్కువగా తినేస్తున్నారని జాతీయ పోషకాహార సంస్థ పేర్కొంది. బియ్యం/ గోధుమలను అధికంగా తీసుకుంటున్నారని. పోషకాలు అధికంగా ఉండే కూరగాయలు, ఆకుకూరలు, పాలు, పప్పుధాన్యాలు, పౌల్ట్రీ ఉత్పత్తులు, చేపలను చాలా తక్కువగా తింటున్నారంది. పట్టణ ప్రజలైతే చిప్స్, బిస్కెట్లు, చాక్లెట్లు, స్వీట్లు వంటి తెగ లాగించేస్తున్నారని.. అసమతుల ఆహారంతో ఊబకాయం, మధుమేహం, రక్తపోటు సమస్యల బారిన పడుతున్నారంది.