Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

త్వరలో 23 కిలో మీటర్ల మేర అండర్ డ్రైనేజ్

గొంగళి పురుగులా ఉన్న ఖమ్మంను సీతాకోక చిలుకలా చేసుకున్నాం..మంత్రి పువ్వాడ.

▪నగరంలోని 1, 2, 3 టౌన్ లలో విస్తృత పర్యటన.

▪ప్రజలను కలిసి వారి సమస్యలు తెలుసుకున్న మంత్రి..

▪అనేక అభివృద్ది పనుల పరిశీలన, ప్రజలు వివరించిన సమస్యలను తక్షణమే పరిష్కారించలని అధికారులకు ఆదేశాలు..

▪మంత్రి పువ్వాడతో సైకిల్ పై పర్యటించిన జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, మేయర్, సుడా చైర్మన్, కార్పొరేటర్లు, అధికారులు..
ఖమ్మం బ్యూరో మే 15(నిజం న్యూస్)
నాడు గత పాలకుల హయాంలో గొంగళి పురుగులా ఉన్న ఖమ్మంను బీ ఆర్ ఎస్ ప్రభుత్వ వచ్చాక సీతాకోక చిలుకలా మర్చుకున్నామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు అన్నారు.

ఖమ్మం నగరాభివృద్ధిలో భాగంగా చేపట్టిన అనేక పనులు, ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు సైకిల్ పై ఖమ్మం కార్పోరేషన్ పరిధిలోని పలు డివిజన్లలో పర్యటించారు..

వాడ వాడ పువ్వాడ కార్యక్రమంలో భాగంగా ప్రజల వద్దకు నేరుగా వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

జిల్లా కలెక్టర్ వి పి గౌతమ్, మేయర్ పునుకొల్లు నీరజ, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, మున్సిపల్, రెవెన్యూ, విద్యుత్ ఆధికారులతో కలిసి సైకిల్​పై పర్యటించారు.

నగర వీధుల్లో తిరుగుతూ.. పారిశుధ్యం, విద్యుత్ స్తంభాలు, రోడ్డుకు అడ్డుగా ఉన్న హ్యాండ్ బోర్లు, డివైడర్లు, సెంట్రల్ డివైడర్లలో ఉన్న మొక్కలు, మురుగు కాల్వలు పరిశీలించి అక్కడ అక్కడ పేరుకుపోయిన చెత్తను తొలగించాలని ఆదేశించారు.

మున్సిపల్ కార్యాలయం నుండి బైపాస్ రోడ్డు మీదగా నూతన బస్ స్టాండ్ కు చేరుకుని టాయిలెట్స్ ను పరిశీలించారు.దుకాణదారులతో మాట్లాడి వస్తువుల ధరలు అడిగి తెలుసుకున్నారు. పలువురు ప్రయాణికులను కలిసి వారి ప్రయాణ వివరాలు, అక్కడ ఉన్న సేవలు, సౌకర్యంపై ఆరా తీశారు.

50వ డివిజన్ మామిళ్లగూడెం పెద్ద మార్కెట్ లోకి వెళ్ళి అక్కడ రైతులు, కూరగాయల వ్యాపారులతో మాట్లాడారు. ప్రతి రోజు అధిక మొత్తంలో కూరగాయల వ్యర్ధాలు ఆలస్యంగా తొలగిస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఆయా చెత్త తొలగింపు పనులను తక్షణమే పరిశీలించి చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు.

పి వి నర్సింహ రావు పార్క్ ను పరిశీలించారు. టాయిలెట్స్, గ్రీనేరీ, ఓపెన్ జిమ్ లను పరిశీలించారు. పార్క్ లో కరాటే శిక్షణ పొందుతున్న చిన్నారులతో ముచ్చటించరు.

ALSO READ: శ్రీ సర్వ శక్తి స్వరూపిణి మాత ఆలయంలో శత రుద్రాభిషేకం

బర్హాన్ పురం, బస్ డిపో మయూరి సెంటర్, త్రీ టౌన్ జూబ్లీపుర ప్రాంతాల్లో పర్యటించారు. 46వ డివిజన్ లో మరమ్మత్తులు కొనసాగుతున్న మయూరి సెంటర్ బ్రిడ్జి పనులను పరిశీలించారు. ఆయా పనుల వివరాలను ఆర్ అండ్ బీ ఈఈ శ్యామ్ ప్రసాద్ ను అడిగి తెలుసుకున్నారు.

స్వర్ణభారతి కళ్యాణ మండపం, తహసిల్దార్ కార్యాలయం, ట్రంక్ రోడ్, కల్వొడ్డు, మోతి నగర్ లో మురుగు కాల్వను పరిశీలించారు. ఎప్పటికప్పుడు మురుగును తొలగించాలని సూచించారు.

35వ డివిజన్ బురద రాఘవాపురం ఎస్సీ కాలనీలో పర్యటించి స్థానిక గృహాల వారితో మాట్లాడారు. వారి సమస్యలను అడిగితెలుసుకున్నారు. మిషన్ భగీరథ పథకం ద్వారా ఏర్పాటు చేసిన త్రాగునీటి ప్రధాన పైప్ లైన్ ను మంత్రి పువ్వాడ ప్రారంభించారు. సైడ్ కాల్వలు లేకపోవడం వల్ల ఇబ్బందిగా ఉందని, రోడ్డు శిధిలావస్థలో ఉందని చెప్పగా తక్షణమే ఆయా పనులకు అంచనాలు వేయించి సైడ్ కాల్వలు, రోడ్డు ఏర్పాటు చేస్తామన్నారు.

భక్తపోతన స్ట్రీట్, డాబాల బజార్, గుట్టల బజార్ లో పర్యటించారు. ప్రజలకు శుద్ది చేసిన త్రాగు నీటి అందించేందుకు, త్రాగునీటి ఎద్దడికి శాశ్వత పరిష్కారం కోసం 32వ డివిజన్ గుట్టల బజార్ లో మిషన్ భగీరథ పథకం ద్వారా పబ్లిక్ హెల్త్ అధ్వర్యంలో నిర్మించిన 2300 కే యల్ సామర్ధ్యం కలిగిన ఓవర్ హెడ్ ట్యాంక్ ను పరిశీలించారు.

గుట్టల బజార్, జహీర్ పుర, రాజేంద్ర నగర్, శ్రీనివాస్ నగర్ బ్రిడ్జి మీదగా చర్చ్ కాంపౌండ్, బోనకల్ క్రాస్ రోడ్, చెరువు బజార్, మాణిక్య నగర్, అబ్దుల్ కలాం నగర్ మీదగా మమత రోడ్ వరకు పర్యటించారు.

ప్రజల వద్దకు నేరుగా వెళ్లి వారి సమస్యలు తెలుసుకుని వారు నివేదించిన సమస్యలను, చేపట్టాల్సిన పనులు, గత పట్టణ ప్రగతిలో చేపట్టిన పనుల గూర్చి స్వయంగా తెలుసుకుని పరిష్కరించేందుకు సైకిల్ పై పర్యటిస్తున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు.

సుమారు రెండు గంటల పాటు ఒకటో పట్టణం, రెండవ పట్టణ ప్రాంతాల్లో పర్యటించారు. రోడ్లు, మురుగు కాలువలు, ఇంకా అభివృద్ధి చేయాల్సిన పనులపై అధికారులతో చర్చించారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. గత నాలుగు సంవత్సరాలలో ప్రజలకు సరైన రీతిలో మౌళిక వసతులు అందుతున్నాయని, అందుకు ప్రణాళిక బద్దంగా పని చేస్తున్నామని వివరించారు.

వాడ వాడ పువ్వాడ కార్యక్రమం ద్వారా ప్రజలకు మరింత చేరువ కావాలనే ఉద్దేశంతో క్షేత్రస్థాయిలో పర్యటన చేస్తున్నామన్నారు. ముఖ్యంగా నగరంలో త్రాగునీటి సమస్యను పూర్తిగా అధిగమించామని స్పష్టం చేశారు.

నేడు చెత్త సేకరణ అద్భుతంగా జరుగుతుందని, గతంతో పోల్చితే నేడు రోడ్ల మీద చెత్త లేకుండా ట్రాక్టర్ లు, మిని వ్యాన్ ల ద్వారా నిర్విరామంగా చెత్త సేకరణ జరుగుతుందన్నారు.

మురుగు సమస్యను సైతం పూర్తిగా తొలగించాలనే ఉద్దేశంతోనే డివిజన్ కు రూ.40 లక్షలు కేవలం డ్రైన్స్ నిర్మాణం కోసమే కేటాయించామని అన్నారు

ప్రస్తుతం నిర్మించిన గోళ్ళపాడు ఛానల్ అండర్ గ్రౌండ్ 13 కీ మి. ఎలా చేశామో.. త్వరలో 23 కిలో మీటర్ల మేర అండర్ డ్రైనేజ్ నిర్మాణ చేయాలని తలచామని, ఆయా పనులకు పురపాలక శాఖ మంత్రి కేటిఆర్ గారు అతి త్వరలో శంకుస్థాపన చేయనున్నట్లు చెప్పారు.

ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుండి ప్రతి మూడు నెలలకు ఒకసారి సైకిల్‌పై క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలు తెలుసుకుంటున్నామని పువ్వాడ తెలిపారు.

స్వయంగా పరిశీలించడం ద్వారా ఇప్పటి వరకు చాలా సమస్యలు పరిష్కరించామని చెప్పారు. ప్రజాసమస్యలను తెలుసుకుని అక్కడికక్కడే పర్యటించడమే ఈ పర్యటన ఉద్దేశమని, ఖమ్మం నగరాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తామని వివరించారు.