శ్రీ సర్వ శక్తి స్వరూపిణి మాత ఆలయంలో శత రుద్రాభిషేకం
తుర్కపల్లి, మే 15(నిజం న్యూస్) :
తుర్కపల్లి మండలం కొండాపూర్ గ్రామంలో గల శ్రీ సర్వశక్తి స్వరూపిణి మాత ఆలయ 27 వార్షికోత్సవంలో భాగంగా సోమవారం ఉదయం మేలుకొలుపు, సుప్రభాతం సేవ, హారతి, గణపతి పూజ, మంటపారాధన ,పుణ్యహావచనం, ద్వజారోహణం, స్థాపిత దేవత విశేష పూజలు, శత రుద్రాభిషేకం, మహా లింగార్చన, ఆధ్యాత్మిక ప్రవచనాలు, గ్రామ దేవతల పూజా కార్యక్రమాలు,
ALSO READ: లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తూ పట్టుబడ్డ ఆస్పత్రులు
సాయంత్రం హారతి ,నిరాజనసేవ, తీర్థప్రసాదాలు, ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు హరే రామ హరే కృష్ణ నామ సంకీర్తన శ్రీ పాండురంగ ఆశ్రమం వారిచే నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పాండురంగ ఆశ్రమం నిర్వాహకులు అప్పాల సత్యనారాయణ శర్మ, అప్పల విట్టల్ శర్మ, అప్పాల రసరాజు శర్మ, శ్రీ సర్వశక్తి స్వరూపిణి మాత ఆలయం నిర్వాహకులు తొలిచుక్క మాధవి శ్యామ్ కుమార్, గ్రామస్తులు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు