Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

అన్నదాత ను మోసం చేస్తే పీడీ యాక్ట్

వరంగల్ పోలీస్ కమిషనర్ ఏ.వి.రంగనాథ్

జమ్మికుంట, మే 15 (నిజం న్యూస్)

వ్యవసాయదారులను మోసానికి గురిచేసేవారిపై పీడీ కేసులు నమోదు చేస్తామని వరంగల్ పోలీస్ కమిషనర్ హెచ్చరించారు.

కరీంనగర్ జిల్లా వీణవంక కు చెందిన రవిశెట్టి రవిబాబు వరంగల్, కరీంనగర్ జిల్లాలోని రైతన్న నుండి ధాన్యం కొనుగోలు చేసి వారికి ఇవ్వాల్సిన డబ్బులను ఎగవేతకు పాల్పడినందుకుగాను నిందితుడిపై వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీస్ కమిషనర్ తొలిసారిగా పిడీ యాక్ట్ ఉత్తర్వులను జారీచేశారు.

Also read: మున్సిపాలిటీ స్థలాలను పరిరక్షించాలి

పోలీస్ కమిషనర్ జారీ చేసిన పీడీ యాక్ట్ ఉత్తర్వులను కాజీపేట ఏసీపీ శ్రీనివాస్ నిందితుడికి సోమవారం కాజీపేట ఏసీపీ కార్యాలయంలో అందజేసి చర్లపల్లి జైలుకి తరలించారు.

ఈ సందర్భంగా ఏసీపీ శ్రీనివాస్ వివరాలను వెల్లడిస్తూ నిందితుడు వరంగల్ ,కరీంనగర్ జిల్లాల్లో వ్యవసాయ దారుల నుండి సుమారు 6 టన్నుల వరి ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులకు చెల్లించాల్సి సుమారు కోటిన్నర పైగా ధాన్యం డబ్బులు చెల్లించకుండా డబ్బు ఎగవేతకు పాల్పడటంతో, వ్యవసాయదారులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఎల్కతుర్తి, ముల్కనూరు, వంగర పోలీస్ స్టేషన్లలో నిందితుడిపై కేసులు నమోదు కావడంతో నిందితుడిపై పీడీ యాక్ట్ ఉత్తర్వులు జారీ అయింది.

వ్యవసాయదారుల నుండి కొనుగోలు చేసిన ధాన్యంకు వ్యాపారస్తులు సకాలంలో చెల్లింపులు చేయాలని, అలాకాకుండా వారికి ఇచ్చే డబ్బులు ఎగవేత ధోరణికి పాల్పడితే సహించేది లేదని.దేశాభివృద్ధిలో కీలకంగా నిలిచే రైతన్నకు బాసటగా నిలువాల్సిన బాధ్యత మనందరి పై వుందని పోలీస్ కమిషనర్ తెలిపారు. ఎల్కతుర్తి ఇన్స్ స్పెక్టర్ ప్రవీణ్ కుమార్, ఎస్ ఐ మహేందర్ పాల్గొన్నారు.