Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

రాఘవ లారెన్స్ హీరో గా చంద్రముఖి-2

నటుడు రాఘవ లారెన్స్ ప్రస్తుతం ‘చంద్రముఖి 2’ సినిమా షూటింగ్‌లో ఉన్నారు. ఈ సినిమా చివరి షెడ్యూల్ షూటింగ్ మే 15 నుండి మైసూర్‌లో ప్రారంభం కానుందని సమాచారం.  నిర్మాతలు ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 15 న గణేష్ చతుర్థికి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

‘చంద్రముఖి 2’ 2005లో విడుదలైన తమిళ క్లాసిక్ చిత్రం ‘చంద్రముఖి’కి సీక్వెల్.

రజనీకాంత్, జ్యోతిక, నయనతార, ప్రభు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం 500 రోజులకు పైగా థియేటర్లలో నడిచి బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది.

ALSO READ: ఆంధ్ర నుంచి తెలంగాణలోకి అక్రమ ఇసుక రవాణా

పి వాసు దర్శకత్వం వహించిన ‘చంద్రముఖి 2’లో రాఘవ లారెన్స్, కంగనా రనౌత్, వడివేలు, రాధికా శరత్‌కుమార్, లక్ష్మీ మీనన్, మహిమా నంబియార్, శ్రుతి డాంగే, సుభిక్ష కృష్ణన్, రవి మారియా, కార్తీక్ శ్రీనివాసన్ తదితరులు నటించారు.

ఈ చిత్రానికి సంగీతం ఎంఎం కీరవాణి స్వరాలు సమకుర్చారు. సాంకేతిక బృందంలో ఆర్ట్ డైరెక్టర్ తోట తహ్రానీ,  సినిమాటోగ్రాఫర్ రవివర్మ ఉన్నారు.

10 రోజుల పాటు చివరి షెడ్యూల్‌ షూటింగ్‌ జరుపుకోనున్న ఈ చిత్రం జూన్‌ నాటికి పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలను జరుపుకోనుందని సమాచారం.