ఆంధ్ర నుంచి తెలంగాణలోకి అక్రమ ఇసుక రవాణా
మొద్దు నిద్ర నటిస్తున్న అధికారులు
అధికారుల పనితీరుపై సర్వత్ర విమర్శలు
బోనకల్ మే 14 ( నిజం న్యూస్)
ఇసుక ధరలు ఆకాశాన్ని తాకడంతో అక్రమార్కులు రాత్రి పగలు తేడా లేకుండా ఇసుక దందాకు తెరలేపుతున్నారు.దోచుకున్నోడికి దోచుకున్నంత అన్నట్లుగా మారింది
అక్రమ ఇసుక మాఫియా.బోనకల్ మండల కేంద్రానికి సరిహద్దు ప్రాంతమైన ఎన్టీఆర్ క్రిష్ణ జిల్లా నుంచి అక్రమ ఇసుక రవాణా ట్రాక్టర్ల ద్వారా రోజుకు వందల సంఖ్యలో జోరుగా ఇసుకను తరలిస్తున్నారు.
ALSO READ: పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్లుగా….
నంబర్ ప్లేట్లు లేకుండా మండల కేంద్రం గుండా ఇసుక అక్రమ మాఫియా జరుగుతున్న సంబంధిత అధికారులు ఏమాత్రం పట్టించుకున్న దాఖలాలు లేకపోగా తమకు సంబంధం లేనట్లు వ్యవహరించడం పట్ల అధికారుల పనితీరుపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు చేపట్టి అక్రమ ఇసుక మాఫియాకు అడ్డుకట్ట వేయాలని మండలవాసులు కోరుతున్నారు.