పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్లుగా….
నాట్య మయూరి అర్చన ను అభినంధించిన మంత్రి పువ్వాడ అజయ్
హైదరాబాద్ బ్యూరో మే 14, (నిజం న్యూస్ )
ఖమ్మం శ్రీనగర్ కాలనీ కి చెందిన ముంజలా అర్చన స్థానిక పాఠశాల లో యూకెజి చదువుతుంది.
శాస్త్రీయ, జానపద నృత్యాలలో జాతీయ, అంతర్జాతీయ స్థాయి ల లో అద్భుతమైన ప్రతిభ కనపరిచి ఎన్నో అవార్డ్స్, రికార్డ్స్, మెడల్స్ సాధించింది.
తెలంగాణ, ఖమ్మం నుండి ఇంత చిన్న వయసులో ఎన్నో అవార్డ్స్, రికార్డ్స్ సాధించిన అర్చన ను తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ మంత్రి క్యాంపు ఆఫీస్ లో ఘనంగా సన్మానించారు.
జానపద నృత్యంలో అద్భుతమైన ప్రతిభ కనపరిచ్చినందుకు గాను రబింద్రనాధ్ ఠాగూర్ కళా విభూషణ అవార్డు సాధించడం జరిగింది
ALSO READ: ఆరుగురు మహిళలను పొట్టన పెట్టుకున్న ..
అదేవిదంగా భరత నాట్యం లో 52 సముక్త, అసముక్త ముద్రలను 24సెకండ్స్ లో చెప్పి ఇండియా బుక్ అఫ్ రికార్డు మరియు తెలంగాణ బుక్ అఫ్ వరల్డ్ రికార్డు సాధించడం జరిగింది.
అదే విదంగా ఒక సంవత్సరం లోనే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో 152 శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు చేసి ఛాంపియన్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డు లిటిల్ ఛాంప్ 2023 ని సాధించడం జరిగింది.
ఇంకా నేషనల్ బుక్ అఫ్ రికార్డు భారత్ విభూషన్, గ్లోబల్ అచీవర్స్ అవార్డు తమిళనాడు గవర్నమెంట్, భారత్ నృత్య సమ్మాన్ అవార్డు బెంగుళూరు,, ప్రైడ్ అఫ్ ఇండియా అవార్డు, రాష్ట్రీయ ప్రతిష్ట పురస్కార్ నేషనల్ అవార్డు, ఇంటర్నేషనల్ ఐకాన్ అవార్డు, సంగీత కళా భూషణ్ అవార్డు, డాక్టర్ ఏ. పి. జె అబ్దుల్ కలాం అవార్డు, తెలంగాణ బాల రత్న అవార్డు, ఇండియాస్ గాట్ డైమండ్ అవార్డు, తాయి ఆర్ట్స్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డు, ఇంత చిన్న వయసు లో ఇన్ని అవార్డ్స్ సాధించిన అర్చన ను మంత్రి అజయ్ అభినంధించి తను సాధించిన అవార్డ్స్ ను అర్చన కు ఇచ్చి ఘనంగా సత్కరించడం జరిగింది.